టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో హీరోయిన్స్ ఉన్నారు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించి గొప్ప హీరోయిన్స్ అయినవాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి కావ్యా కల్యాణ్ రామ్ చేరిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే రెండు బిగ్ హిట్లు అందుకుంది. మూడో హిట్టు కోసం కూడా రెడీ అయిపోతోంది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కి పరిచయమైన కావ్యా కల్యాణ్ రామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడక్షన్లు అక్కర్లేదు. వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట అంటూ ఎప్పుడో రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను సొంతం చేసుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయింది. తర్వాత చదువుపై ఫోకస్ చేసి.. లా పట్టా కూడా పొందింది. ఇప్పుడు తిరిగి హీరోయిన్ గా ఇండస్ట్రీలో హిట్టు మీద హిట్టులు కొడుతోంది. మసూద సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. తర్వాత ప్రియదర్శితో కలిసి బలగం సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఇప్పడు మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఎంఎం కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్టుగానే కాకుండా.. హీరోగా కూడా తనని తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు ‘ఉస్తాద్’ అనే ఒక గ్రిప్పింగ్ కథతో కావ్యా కల్యాణ్ రామ్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి ఫణిదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ని హీరో రానా లాంఛ్ చేశాడు. టీజర్ కు చాలా మంచి స్పందన వచ్చింది. లైఫ్ లో తన గోల్ రీచ్ అయ్యేందుకు స్ట్రగుల్ అయ్యే ఒక యువకుడి పాత్రలో శ్రీ సింహా అద్భుతంగా నటించాడు. సినిమా ఎలా ఉండబోతోంది అనేది కూడా ఈ టీజర్ లో ఓ క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమా టీజర్ లాంఛ్ సందర్భంగా హీరోయిన్ కావ్యా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ నోరు జారేసింది. ఆ మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కథ గురించి మాట్లాడుతూ.. “ఈ సినిమా ఇంకా టీజర్ దగ్గరే ఉంది. ఇంకా సాంగ్స్, ట్రైలర్ చాలా ఉన్నాయి. అయితే ఉస్తాద్ అనే పదం ఏంటి అంటే.. మనకు లైఫ్ లో ఏమైనా నేర్పించే వారిని టీచర్ అంటారు. అదే ఉర్దూలో అయితే ఉస్తాద్ అంటారు. ఈ సినిమాలో హీరో ఉస్తాద్ కాదు. హీరో బండి పేరు ఉస్తాద్. ఆ బండి అతనికి ఏం నేర్పించింది అనేది కథ. ఇంక ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్లలో మమ్మల్ని ఏసుకోకండి” అంటూ కావ్యా కల్యాణ్ రామ్ చెప్పుకొచ్చింది. అయితే ముందు చెప్పిన కథ అంతా పక్కకు నెట్టేసి. ఆ పదాన్ని మాత్రం పట్టుకుని వైరల్ చేస్తున్నారు. ఉస్తాద్ టీజర్ చుశారా? ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.