బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ తన ఒంటరి జీవితానికి ఎండ్ కార్డు ఇవ్వబోతున్నారని బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది. దీపావళి పండగరోజే విక్కీ కౌశల్, కత్రినా కుటుంబాలు ‘రోకా’ ఫంక్షన్ చేసుకున్నట్లు సమాచారం. దర్శకుడు కబీర్ ఖాన్ ఇంట్లో ఈ వేడుక జరిగిందట. కత్రినా కబీర్ను సోదరుడిలా భావిస్తారు. అందుకే ‘రోకా’ వేడుకకు ఆయన ఇల్లు వేదిక అయిందట. కబీర్ దర్శకత్వంలో ‘న్యూయార్క్’, ‘ఏక్ థా టైగర్’ చిత్రాల్లో కత్రినా నటించారు. కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెళ్లికి సిద్ధమయ్యారని, డిసెంబర్లో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారని బాలీవుడ్ అంటోంది. మరి.. ఇయర్ ఎండింగ్ కి వీరిద్దరు కలుస్తారేమో వేచి చూడాలి.
ఇదీ చదవండి: ‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్లే..
‘రోకా’ వేడుక ఏంటంటే పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో ఇది ఒక భాగం. నిశ్చితార్థం ఎప్పుడు చేసుకోవాలి?, పెళ్లి ముహూర్తం, వేదిక, విందు వంటి విషయాలుపై చర్చించుకోవడానికి అబ్బాయి–అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు ఒకచోట కలుస్తారు. రోకా అనేది ఉత్తరాదిన ఆచరించే ఒక సంప్రదాయం.