ఈ మధ్య కాలంలో సెల్‌ఫోన్ ఓ నిత్యావసర వస్తువు అయిపోయింది. సెల్‌ఫోన్ వాడనిదే ప్రాణాలు నిలవవు అన్నట్లు మనుషులు తయారవుతున్నారు. సెల్‌ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుపోయినా.. ఎవరైనా దాన్ని దొంగిలించినా దాని యజమానులు గిలగిల్లాడిపోవటం పరిపాటి. ఇది సామాన్యులనుంచి, పెద్ద పెద్ద సెలెబ్రిటీల వరకు ఎవరికైనా వర్తిస్తుంది. తాజాగా, ప్రముఖ నటి కస్తూరి శంకర్ తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారు. చెన్నై మెట్రోలో ప్రయాణిస్తున్న ఆమె తన ఫోన్‌ను మిస్ చేసుకున్నారు. ఫోన్ పోయిందని గుర్తించిన ఆమె ట్విటర్ వేదికగా ఈ విషయంపై స్పందించారు. తన ఫోన్‌ను ఎలా కనుక్కోవాలో చెప్పడంటూ చెన్నై మెట్రో అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనికి మెట్రో అధికారులు స్పందించారు. ఏం చేయాలో చెప్పారు.
dear @cmrlofficial , I have lost my phone on the Chennai metro ! Can you help me find it? Whom can I contact?
— Kasturi Shankar (@KasthuriShankar) December 11, 2022
ఆమె వారు చెప్పినట్లు చేయటంతో తన ఫోన్ తనకు దక్కింది. ఇంతకీ ఏం జరగిందంటే.. నటి కస్తూరి శంకర్ చెన్నైలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఆమె చెన్నై మెట్రోలో ప్రయాణిస్తుండగా తన ఫోన్‌ను పోగొట్టుకుంది. దీంతో తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ‘‘ డియర్ చెన్నై మెట్రో రైల్ అఫిషియల్స్. నేను చెన్నై మెట్రోలో నా ఫోన్ పోగొట్టుకున్నాను. దాన్ని కనుక్కోవడంలో సహాయం చేయండి. నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి’’ అని అడిగింది. దీనికి చెన్నై మెట్రో అధికారులు స్పందిస్తూ.. ‘‘ మేడమ్.. మీ దగ్గరలోని మెట్రో స్టేషన్ కంట్రోలర్‌ను సంప్రదించండి. వాళ్లు మీకు తగిన విధంగా సహాయం చేస్తారు’’ అని సమాధానమిచ్చారు.
OMG @cmrlofficial found my phone!
No words to praise the dedication and integrity of CMRL staff. Many passengers have gotten back lost valuables.
Special thanks to Mr Vijay Varadhan, joint GM .
I already am a Chenno metro loyalist, now I have one more reason to love them! https://t.co/UGLpAYrFbR— Kasturi Shankar (@KasthuriShankar) December 13, 2022
కస్తూరి శంకర్ వారు చెప్పినట్లుగానే చేసింది. మెట్రో అధికారుల సహకారంతో ఫోన్‌ను తిరిగి పొందింది. ఆ వెంటనే ట్విటర్‌లో ‘‘ నా ఫోన్ దొరికింది. చెన్నై మెట్రో రైల్ అధికారుల పనితనం, నిబద్దతను ఎలా పొగడాలో మాటలు రావటం లేదు. చాలా మంది ప్రయాణికులు తాము పోగొట్టుకున్న విలువైన వస్తువుల్ని తిరిగి పొందారు. చెన్నై మెట్రో రైల్ జాయింట్ జీఎమ్ విజయ్ వర్ధన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు చెన్నై మెట్రో అంటే చాలా ఇష్టం. ఈ ఘటన ఆ ప్రేమను మరింత పెంచేసింది’’ అని రాసుకొచ్చింది. మరి, చెన్నై మెట్రో అధికారుల పుణ్యమా అని పోగొట్టుకున్న ఫోన్‌ను కస్తూరి శంకర్ తిరిగి పొందటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.