సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కస్తూరి శంకర్.. ఓ యువకుడు చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నీచుడ్ని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేయడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు.
నటి కస్తూరి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. సమాజంలో ఏదైనా తప్పు జరిగితే వెంటనే స్పందిస్తుంటారు, ప్రశ్నిస్తుంటారు, తనదైన శైలిలో ఖండిస్తుంటారు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేసిన వారిపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఆదిపురుష్ లో శ్రీరాముడికి మీసాలేంటి అని కూడా ప్రశ్నించారు. ఇటీవల శ్రియా డ్రెస్ పై కూడా కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె మరోసారి ఫైర్ అయ్యారు. ఓ వ్యక్తి మరొక వ్యక్తిపై మూత్రం పోస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోని షేర్ చేస్తూ నటి కస్తూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మామూలుగా ఒక మనిషి మూత్రం పోసే బాత్రూం చూస్తేనే అసహ్యం వేస్తుంది.
మూత్రం పోసి నీళ్లు కొట్టకపోతే కోపం వస్తుంది. అలాంటిది ఒక మనిషి ముఖం మీద మూత్రం పోస్తే వినడానికే రక్తం మరిగిపోతుంది కదా. మరి ఆ పరిస్థితిలో ఉన్న అమాయకుడి పరిస్థితి ఏంటి? ఇంకా కొన్ని చోట్ల మనిషి పట్ల మనిషికి వివక్ష సజీవంగానే ఉంది. ఇంత అభివృద్ధి చెందినా కూడా ఇంకా వివక్ష చూపిస్తూనే ఉన్నారు. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఊగుతూ, సిగరెట్ తాగుతూ పర్వేష్ శుక్లా అనే యువకుడు మెట్ల మీద కూర్చున్న యువకుడిపై మూత్రం పోశాడు. ఆ యువకుడు ఏమీ చేయాలని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నటి కస్తూరి శంకర్ స్పందించారు.
‘కుక్కలు కూడా ఇలా చేయవు. ప్రవేష్ శుక్లా బీజేపీ ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లాకు సన్నిహితుడని తెలుస్తోంది. ఆ నీచుడ్ని వెంటనే శిక్షిస్తారా లేక వదిలేస్తారా? గతంలో ఎయిర్ ఇండియా విమానంలో తమిళనాడు బీజేపీ నేత చేసిన ఘటన గుర్తుకొచ్చి అడుగుతున్నా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. పోలీసుల దృష్టికి వెళ్లడంతో పర్వేష్ శుక్లాను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ వెల్లడిస్తూ ట్వీట్ చేయగా.. కస్తూరి శంకర్ రీట్వీట్ చేశారు. ‘వావ్ చాలా వేగంగా చేశారు. యువకుడిపై మూత్రం పోసిన నీచుడిని అరెస్టు చేసి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అమలు చేసినట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ఇప్పటికే తెలుసుకున్నారు. మూత్రం పోసిన నీచుడు పీసీఎ, ఐపీసీ 290, ఐపీసీ 352, ఇతర సెక్షన్ల కింద శిక్షించబడతాడు. ఇక ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లా.. నిందితుడు పర్వేష్ శుక్లాతో ఎలాంటి సంబంధం లేదని ఖండించారు’ అంటూ కస్తూరి ట్వీట్ చేశారు.
Even dogs wont do this.They say this sicko Pravesh Shukla is close aide of BJP madhyapradesh MLA Kedarnath Shukla.
Will this inhuman be punished immediately and decisively or will the matter be hushed up ? I ask because I remember the AirIndia and TNBJP peegates.
-cont https://t.co/E3GQLyAoQP— Kasturi (@KasthuriShankar) July 4, 2023
Wow that was quick. MadhyaPradesh CM @ChouhanShivraj has already gotten that urinating scoundrel Pravesh Shukla arrested and enforced NSA. He shud be punished under PCA, IPC 290 IPC 352 and more.
Btw
Kedarnath Shukla has denied any connection to him. pic.twitter.com/skRc21OTvl— Kasturi (@KasthuriShankar) July 4, 2023
ఇది కూడా చదవండి: వీడియో: ఫుల్లుగా తాగి గిరిజనుడిపై మూత్ర విసర్జన.. సీఎం సీరియస్