సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. బయట నుంచి చూసేవారికి అంతా బ్రహ్మండంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఇండస్ట్రీలోని చాలామంది రంగుల జీవితం వెనక ఎన్నో వ్యధలు, కష్టాలు, కడగండ్లు. కానీ వాటన్నింటిని కెమరా బయటే వదిలేసి.. తమకు వచ్చిన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తులే పాపులర్ సీరియల్ హీరోయిన్స్ ఐశ్వర్య, తేజస్వి. ఓ రియాలిటీ షోలో పాల్గొన్న వీరు.. తమ జీవితంలోని విషాదాలను వెల్లడిస్తూ స్టేజ్ మీదే కన్నీటి పర్యంతం అయ్యారు.
ఇది కూడా చదవండి: షోలో ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ బాబు లవర్! అమ్మాయి ఎవరంటే?
స్టార్‌మాలో ప్రసారం అవుతున్న ‘C/O అనసూయ’సీరియల్స్‌తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న తేజస్విని(శివాణి) మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగానని, ఆఖిరికి తన తండ్రి చివరిచూపుకు కూడా నోచుకోలేదని నటి తేజస్విని పేర్కొంది. ‘ఇంటర్‌లో ఉండగా మా నాన్న చనిపోయారు. అప్పటివరకు తెలియదు. ఆరోజు రాత్రంతా జర్నీ చేసి ఊరెళ్లాను. అప్పటికే అన్నీ చేసేశారు. ఆయన చనిపోయేవరకు కూడా నాన్న ప్రేమను పొందలేకపోయాను. నా జీవితంలో చాలా కోల్పోయాను’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: “నాతిచరామి” మూవీలో నటనతో ఆకట్టుకుంటున్న సందేశ్‘కస్తూరి’ ఫేమ్ ఐశ్వర్య శ్వర్య తన తండ్రి చేసిన మోసాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యింది. ‘నేను కడుపులో ఉండగానే మా నాన్న అమ్మని వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి అమ్మ నన్ను ఇక్కడివరకు తీసుకొచ్చింది. ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఒక ఆడదాన్ని జీవితాన్ని ఎందుకు పాడు చేయాలి? దయచేసి మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి.. ఇలా ఒక ఆడదాని జీవితాన్ని ఇలా పాడుచేయకండి ప్లీజ్’ అంటూ చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంది. వీరి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. ఐశ్వర్య వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: విడుదలకు ముందే RRR కథ మొత్తం లీక్! క్లైమ్యాక్స్ లో పూనకాలే!