Kasthuri Shankar: తమిళనాడులో మంత్రి కాన్వాయ్ ఘటన చర్చకు దారి తీస్తోంది. సదరు మంత్రి పర్యటనలో అంబులెన్స్‌ను ఆపి మరీ, కాన్వాయ్‌ను పంపించటంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సోమవారం తమిళనాడుకు చెందిన ఓ మంత్రి తంజావూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కుంబకోణంలోని అనైకారి బ్రిడ్జి మీదుగా వెళుతున్నారు. ఈ బ్రిడ్జి దాదాపు ఒక కిలోమీటర్ పొడవుంది. దానికి తోడు అది వన్‌వే రూటు. ఈ బ్రిడ్జిపై మంత్రి ప్రయాణం నేపథ్యంలో ఆయన కాన్వాయ్ వెళ్లటం కోసం బ్రిడ్జి మీద రాకపోకల్ని నిలిపేశారు.
ఇక, అన్ని వాహనాలతో పాటు ఓ అంబులెన్స్ కూడా నిలిచిపోయింది. మంత్రి కాన్వాయ్‌లో ఉన్న 17 వాహనాలు వెళ్లే వరకు ఆ అంబులెన్స్‌ను అలానే ఆపేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో జనం మంత్రి తీరును తప్పుబడుతున్నారు. ఈ జాబితాలోకి ప్రముఖ నటి కస్తూరి కూడా చేరిపోయారు. తాజాగా, ఈ వీడియోపై ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ ఆ బ్రిడ్జిపై ఉన్నది వన్ వే రూటు నిజమే..
కానీ, మంత్రి 17 కార్లను ఒకే సారి వెళ్లనివ్వాలా? అవన్నీ వెళ్లేంత వరకు అంబులెన్స్‌ను ఆపాలా? ఏంటిది.. అనైకారిపై మరో బ్రిడ్జి కట్టేలా తిరు అన్బిల్ మహేష్ కృషి చేస్తారని భావిస్తున్నాను. ఇదే ఈ ఘటనలో జరిగిన మంచి ’’ అని పేర్కొన్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Accepted it is a one way bridge, ok, but what is the need for 17 cars in the first place? And ambulance made to wait for ALL to pass? Come on.
Hope thiru Anbil Mahesh will push for a second bridge at Anaikkarai . That may be the one good outcome of this incident. https://t.co/fSZthPlei7— Kasturi Shankar (@KasthuriShankar) August 9, 2022
ఇవి కూడా చదవండి : నయనతారకు వాంతులు.. గుడ్ న్యూస్ అనుకుంటున్న ఫ్యాన్స్!