Kasthuri Shankar: గృహలక్ష్మి సీరియల్‌తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ‘కస్తూరీ శంకర్’. సినిమాలు, సీరియళ్లతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాను మాత్రం ఆమె అశ్రద్ధ చేయరు. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందిస్తూనే ఉంటారు. గతంలో తమిళనాడులో మంత్రి తిరు అన్విల్ మహేహ్ కాన్వాయ్ ఘటనపై ఆమె స్పందించారు. ఓ మంత్రి కాన్వాయ్‌కి 17 వాహనాలు ఎందుకని ప్రశ్నించారు. తాజాగా, ఆమె బీజీపీపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ టీషర్టుపై బీజేపీ చేస్తున్న రచ్చను ఆమె తప్పుబట్టారు. ఖరీదైన బట్టలు వేసుకోవటం తప్పా అని ఆమె ప్రశ్నించారు.
కస్తూరీ శంకర్ తన ట్విటర్ ఖాతాలో.. ‘‘రాగాస్ టీషర్ట్ నుండి మహువా బ్యాగు వరకు బీజేపీలోని ఫ్యాషన్ ట్రాకర్లు నిశితంగా అన్నీ పరిశీలిస్తున్నారు. కానీ, అర్థం కాని విషయం ఏంటంటే దాని వల్ల లాభం ఏంటి?. ధనవంతులుగా ఉండటం అంటే దేశ భక్తిలేకపోవటమా? లేదా ఖరీదైన దుస్తులు వేసుకోవటం తప్పా? బీజేపీలోనే చాలా మంది ఉన్నారు. బయట ఎందుకు చూస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. కాగా, రాహుల్ గాంధీ ప్రస్తుతం జోడో భారత్ యాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర కన్యాకుమారిలో ప్రారంభం అయింది.
కాశ్మీర్‌లో పూర్తికానుంది. ఈ నేపథ్యంలోనే యాత్రలో రాహుల్ గాంధీ వేసుకుని తిరిగిన ఓ టీషర్ట్‌ను బీజేపీ టార్గెట్ చేసింది. దాని ధర 41 వేల రూపాయలు అంటూ దానిపై సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది. ఇక, రాహుల్ వేసుకున్న టీషర్ట్ బర్‌బెర్రీ బ్రాండ్‌కు చెందింది. మరి, బీజేపీపై గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ కస్తూరీ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
From RaGa’s shirt to Mahua’s bag, the fashion trackers at BJP sure have a keen eye.
Not sure what message is here.
Is being rich unpatriotic?
Or wearing expensive clothing wrong?
Plenty of that in BJP itself, why look elsewhere?
People in glass houses… https://t.co/vs4Pdw0aYo— Kasturi Shankar (@KasthuriShankar) September 9, 2022
ఇవి కూడా చదవండి : Manchu Vishnu: నేను ఎంత కష్టపడ్డా.. అది అభిమానుల కోసమే: మంచు విష్ణు