Kasthuri Shankar: తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘ కస్తూరి శంకర్’. దాదాపు 30 ఏళ్లుగా ఆమె సినిమాలు చేస్తున్నారు. ఈ 30 ఏళ్లతో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు చేశారు. తెలుగులో పది సినిమాలకు పైగా చేశారు. గ్యాంగ్ వార్ ఆమె మొదటి తెలుగు సినిమా. ఆ తర్వాత నిప్పురవ్వ, గాడ్ ఫాదర్, అన్నమయ్య సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే 2000 సంవత్సరంలో ఆమె రవికుమార్ అనే డాక్టర్‌ను పెళ్లి చేసుకున్నారు. భర్తతో పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పారు. 2009లో వచ్చిన ‘మాలై, మాలై’ అనే తమిళ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. అదే సంవత్సరంలో తెలుగులో గుడు గుడు గుంజం, డాన్ సీను సినిమాలు చేశారు.
ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ సీరియల్స్ చేస్తున్నారు. తెలుగులో ఆమె చేస్తున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. ఇక, తెలుగులో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న కస్తూరి శంకర్‌కు తెలుగు నటీనటులంటే ప్రత్యేక అభిమానం ఉంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. నాగార్జునపై ఉన్న క్రష్ గురించి ఓ పాత ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను 15 ఏళ్లకే సినిమాల్లో నటించటం మొదలుపెట్టాను. నాకంటే డబుల్ ఏజ్ ఉన్న వారితో హీరోయిన్‌గా చేశాను. అంత వయసు ఉన్న వారికి జతగా రొమాన్స్ చేయాల్సి వచ్చేది. అది చాలా ఇబ్బందిగా అనిపించేది.
కానీ, నేను నటించిన హీరోల్లో నాకు ఒక్క నాగార్జున మీదే క్రష్ ఉండేది. ఆ టైంలో అందరికీ నాగార్జున మీద క్రష్ ఉండేది’’ అని చెప్పుకొచ్చారు. కాగా, 60 ఏళ్ల ముసలివాడితో కస్తూరి శంకర్ ఎఫైర్ అంటూ వస్తున్న పుకార్లపై తాజాగా ఆమె స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఎఫైర్ పుకార్ల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ‘‘ చిత్ర పరిశ్రమలో నేనంటే నచ్చని వాళ్లు చాలా మందే ఉన్నారు. వాళ్లంతా పని గట్టుకుని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను 60 ఏళ్ల బిజినెస్ మ్యాన్‌తో ఎఫైర్ కొనసాగిస్తున్నానని, కలిసి తిరుగుతున్నానని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. అలాంటి వార్తలు విని నాకు చాలా బాధ కలిగింది. పరిశ్రమలో హీరోయిన్‌లపై ఇలాంటి వార్తలు రావడం మామూలే. కానీ, ఈ తప్పుడు ప్రచారాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నా’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.