హీరో సూర్య-కార్తీ.. ఈ అన్నదమ్ములకు కేవలం తమిళ్ లోనే కాదు.. మొత్తం సౌత్ ఇండస్ట్రీలోనే మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సూర్య- కార్తీల సినిమాలకు తెలుగులోనూ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. తెలుగు హీరోల సినిమాల్లాగే వీళ్ల సినిమాలు కూడా కలెక్షన్స్ రాబట్టగలవు. వీరి విలక్షణ నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా సూర్య ఎన్నో విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ఉంటాడు. కార్తీ కూడా అన్న దారిలోనే వెళ్తుంటాడు. నటన పరంగా ఇద్దరికీ మంచి మార్కులు వస్తాయి. ఇప్పుడు సూర్య-కార్తీ అభిమానులకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఈ అన్నదమ్ములు స్క్రీన్ షేర్ చేసుకుంది లేదు. చాలా రోజులుగా వీళ్ల మల్టీస్టారర్ కోసం అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: సర్కారు వారి పాట కలెక్షన్ల జోరు.. రెండో రోజు మాస్ కలెక్షన్స్!
అయితే అభిమానుల కల నెరవేరే సమయం వచ్చేసిందని తెలుస్తోంది. సూర్య- కార్తీ ఓ మల్టీస్టారర్ తో రాబోతున్నారనే వార్త కోలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అది కూడా కార్తీ నటించి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఖైదీ సినిమా సీక్వెల్ లో సూర్యా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త సూర్యా అభిమానుల్లో మంచి జోష్ నింపిందనే చెప్పాలి. ఖైదీ- 2లో సూర్య కూడా నటిస్తన్నాడని.. ఓ ప్రత్యేక పాత్ర అతని కోసం రెడీ చేశారని చెబుతున్నారు. తాజాగా కార్తీని సూర్యాతో కలిసి మల్టీస్టారర్ ఎప్పుడు చేస్తారని సుమన్ టీవీ అడగ్గా.. త్వరలోనే చేస్తాం అని సమాధానమివ్వడం ఈ వార్తలను సమర్థించినట్లు అయ్యింది.
ఖైదీ సినిమా 2019లో విడుదలైనా కూడా.. ఆ తర్వాత దాని సీక్వెల్ రావడానికి ఇంత సమయం పట్టింది. అంతేకాకుండా ఖైదీ సినిమా హిందీ రీమేక్ కూడా ఆగిపోయింది. అందుకు కారణం ఆ సినిమాపై ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఖీదీ సినిమా కథ తనదని, కలెక్షన్స్ లో తనకు వాటా కావాలంటూ డైరెక్టర్, ప్రొడ్యూసర్లపై కోర్టుకెక్కాడు. ఆ సమయంలో కోర్టు సినిమా సీక్వెల్, హిందీ రీమేక్ లపై స్టే విధించింది. తాజాగా ఆ కేసులో కోర్టు ఖైదీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కు అనుకూలంగా తీర్పు వెలరించారు. ఖేదీ సినిమా కథ డైరెక్టర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీగా కోర్టు గుర్తించింది. ఆ తీర్పుతో ఖైదీ సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఇదీ చదవండి: సిరిని అర్ధం చేసుకోవడం చాలా కష్టం.. శ్రీహాన్ ఎమోషనల్ వీడియో!
లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విక్రమ్ సినిమాలో సూర్యా ప్రత్యేక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. విక్రమ్ సినిమా తర్వాత సూర్య- కార్తీతో.. లోకేష్ కనగరాజ్ ఖైదీ-2 సినిమా స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఖైదీ-2 కథ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. కార్తీ సినిమాల విషయానికి వస్తే.. పొన్నియిన్ సెల్వన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. కార్తీ 24, కార్తీ 25 సినిమాలు ప్రీ పొడక్షన్ పనుల్లో ఉన్నాయి. మరి ఆ రెండు సినిమాల్లో ఏదైనా ఖైదీ 2గా అనౌన్స్ చేస్తారేమో వేచిచూడాలి. సూర్య- కార్తీ మల్టీస్టారర్ పై మీ అభిప్రాయాలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.