తెలుగు ఇండస్ట్రీలో విజయ్ భూపతి దర్శకత్వంలో ‘ఆర్ఎక్స్ 100’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. చిన్న సినిమా అయినా అనూహ్య స్పందన రావడం మంచి కలెక్షన్లు రాబట్టడం జరిగింది. దాంతో ఈ యంగ్ హీరోకి వరుస ఛాన్సులు వచ్చాయి. అయితే హీరోగానే కాకుండా విలన్ గా కూడా మెప్పిస్తున్నాడు కార్తికేయ. అయితే కార్తికేయ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. కానీ ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం అందడం లేదు.
ఈ క్రమంలో తాజాగా వి. వి. వినాయక్ శిష్యుడైన శ్రీసరిపల్లి దర్శకత్వంలో ‘రాజా విక్రమార్క’చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం డబుల్ ఎయిట్ రామరెడ్డి నిర్మిస్తున్నారు. సీనియర్ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. “రాజా విక్రమార్క” ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. హీరో కార్తీకేయ తన ప్రియురాలు, కాబోయే భార్య లోహితకు కార్తికేయ స్టేజిపైనే ప్రపోజ్ చేసాడు.
ప్రేమ కోసం నా లైఫ్‌లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్ పెట్టానని అన్నాడు కార్తికేయ. ఆ అమ్మాయితో ఈ నెల 21న వివాహం జరగనుంది. ఇండస్ట్రీకి రాక ముందు నుంచే వీరి మద్య పరిచయం ఉందని.. తాను మంచి నటుడిగా సక్సెస్ సాధించిన తర్వాత లోహిత తండ్రిని కలిసినట్టు కార్తికేయ స్టేజ్ పై చెప్పారు. ఇక కార్తీకేయ ప్రపోజ్ చేసిన సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.