ఏమాత్రం హడావిడి లేకుండా విడుదలై సంచలనాలు సృష్టించిన సినిమా ‘కార్తికేయ-2’. యంగ్ హీరో నిఖిల్ – అందాల రాసి అనుపమ పరమేశ్వరన్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ బంపర్‌హిట్‌ను అందుకుంది. హిందీలో అతి తక్కువ స్క్రీన్లలో రిలీజై.. రోజురోజుకు స్క్రీన్ల సంఖ్యను పెంచుకుంటూ.. బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నిఖిల్ కెరీర్‌లోనే అతిపెద్ద సక్సెస్‌గా నిలుస్తూ.. ఊహించని స్థాయిలో ఏకంగా రూ.120 కోట్ల కలెక‌్షన్లతో దుమ్మురేపింది. కంటెంట్ ఉన్న సినిమాకు ప్రమోషన్లు లేకున్నా.. ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి గట్టిగా చాటి చెప్పిన సినిమా కార్తికేయ-2. అలాంటి సినిమా థియేటర్లలో సందడి చేసి.. తాజాగా ఓటీటీని పలకరించింది.
ధియేటర్లలోనే ఎగబడి చూసినా.. ఓటీటీలోనూ తన హవా కొనసాగించింది కార్తికేయ-2. దసరా సందర్భంగా జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన ఈ సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది. ఓటీటీలో విడుదలైన 48 గంటల్లోనే ఏకంగా 100 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో చరిత్రను తిరగరాసింది. ఈ విషయాన్ని జీ5 స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. కృష్ణతత్త్వం నేపథ్యంలో తెరకెక్కిన కార్తికేయ 2 తెలుగుకంటే హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి కీలకపాత్రలలో మెప్పించారు.
This is Crazy 💥💥🔥🔥
Thank you for the Terrific response for #Karthikeya2 on OTT too @ZEE5Telugu @ZEE5India @ZeeTamil
🙏🏽🙏🏽🙏🏽 thank you all .. ever grateful.
100 CR plus Viewing mins in 48 hrs… @anupamahere @chandoomondeti @anupamnawada @AbhishekOfficl @vishwaprasadtg pic.twitter.com/DEQtUITWSp— Nikhil Siddhartha (@actor_Nikhil) October 7, 2022