టాలీవుడ్ యువహీరో నిఖిల్ తాజాగా ‘కార్తికేయ 2’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుండి డిఫరెంట్ స్టోరీ సెలక్షన్స్ తో దూసుకుపోతున్న నిఖిల్.. థ్రిల్లర్ సినిమాలతో సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే.. కార్తికేయ సినిమాతో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు చందూ మొండేటితో సీక్వెల్ గా ‘కార్తికేయ 2‘ చేశాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది.
ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతున్న కార్తికేయ 2.. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి అద్భుతమైన ప్రాఫిట్ క్రియేట్ చేసింది. ఇక థియేటర్లలో ఏ సినిమా విడుదలైనా కొద్దిరోజులకు ఓటిటిలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కార్తికేయ సినిమా ఓటిటి రిలీజ్ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కార్తికేయ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ స్టూడియోస్ వారు సొంతం చేసుకున్నారు.
ఈ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ కి జీ స్టూడియోస్ వారితో సత్సంబంధాలు ఉన్నాయని, అందుకే కార్తికేయ 2 ఓటిటి హక్కులను వారికి విక్రయించినట్లు తెలుస్తుంది. అభిషేక్ అగర్వాల్ గత చిత్రం ‘కశ్మీర్ ఫైల్స్’ సైతం జీ5 లోనే స్ట్రీమింగ్ అయ్యింది. ఇక ఇప్పుడు కార్తికేయ 2 కూడా జీ5 లోనే స్ట్రీమింగ్ కాబోతుందని కన్ఫర్మ్ అయినట్లే. అయితే.. కార్తికేయ 2 స్ట్రీమింగ్ డేట్ ఇంకా లాక్ అవ్వలేదు. కానీ.. దాదాపు థియేట్రికల్ రిలీజైన నాలుగు వారాల తర్వాత ఓటిటి స్ట్రీమింగ్ అవుతుందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. మరి కార్తికేయ 2 మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Karthikeya2 digital rights @ZEE5India. pic.twitter.com/vfgtThgglF
— OTTRelease (@ott_release) August 16, 2022