తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్న కథలతో సినిమాలు చేస్తూ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నా నిఖిల్. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న నిఖిల్.. తాజాగా ‘కార్తికేయ-2’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా విడుదలైన మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ రాబట్టింది ప్రాఫిట్స్ లో చేరింది ‘కార్తికేయ-2’. టాలీవుడ్ లో ఈ సినిమా కలెక్షన్ల దండయాత్ర చేస్తోంది. ఈక్రమంలో కార్తికేయ-2 బాలీవుడ్ లో సైతం భారీ వసూలతో దూసుకెళ్తుంది.
కార్తికేయకు సీక్వెల్ గా చందూ మొండేటి దర్శకత్వం వచ్చిన కార్తికేయ-2 హిందీలో కూడా ఆకట్టుకుంటోంది. అమిర్ ఖాన్ తాజాగ చిత్రం, లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ చిత్రాలను మించి కలెక్షన్స్ రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. విడుదలై మొదటి రోజు థియేటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో కేవలం రూ.9 లక్షలు మాత్రమే రాబట్టింది. రెండో రోజు సినిమపై పాజిటీవ్ టాక్ రావడం, థియేటర్ల సంఖ్య పెరగటంతో ఏకంగా రూ.40 లక్షలు గ్రాస్ వసూలు చేసింది. అయితే కేవలం రూ.9 లక్షల నుంచి ఒక్క రోజులేనే రూ.40 లక్షలు వసూలు చేయడం అన్నది మాములు విషయం కాదు. ఇక మూడో రోజు అంచనాలను మించి రూ.1.25కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
దీంతో బాలీవుడ్ ప్రముఖుల సైతం ఆశ్చర్యానికి లోనవుతున్నారు. బాలీవుడ్ లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమాల కలెక్షన్స్ చూసి.. వారి సొంత ఇండస్ట్రీ సినిమాల వసూళ్లను దాటిపోవడం విశేషం. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరింది. రానున్న రోజుల్లో కలెక్షన్ల పరంగా కార్తికేయ-2 మరిన్ని రికార్డులు క్రియేట్ చేయబోతుందన్న టాక్ వినిపిస్తోంది. మరి.. బాలీవుడ్ లో కార్తికేయ కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం తెలియజేయండి.
#Karthikeya2 (Hindi) Day 3 Gross 1Cr+💥💥💥
Day 1- 9 lakhs
Day 2 – 40 lakhs
3 Days Total gross Collection – 1.5cr#Karthikeya2Hindi 🔥🔥🔥#BlockbusterKarthikeya2 💥🔥#Indialoveskarthikeya2@actor_Nikhil @anupamahere @AAArtsOfficial— jayaram abishek (@Jayaram_nikhil_) August 16, 2022