మన వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. కార్తీకదీపం సీరియల్ తో ఎంతో మంది అభిమానుల మనసులను గెలుచుకుంది. ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్న సమయంలో మలయాళంలో సూపర్ హిట్ సీరియల్ ‘కరతముత్తు‘లో నటించే అవకాశం దక్కించుకుంది ప్రేమి విశ్వనాథన్. ఇక అక్కడ నుంచి ఆమెకి బుల్లితెరలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. 2013 లో మలయాళ టీవిరంగంలో సంచలనాన్ని సృష్టించిన ఈ సీరియల్ ఇప్పుడు తెలుగులో కార్తికదీపంగా వస్తోంది. సుమారు 1082 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పటికీ అత్యధిక టీఆర్ఫీ రేటింగ్ తో దూసుకుపోతుంది. కరతముత్తు తర్వాత వంటలక్క మరో రెండు సీరియల్స్ లో, రెండు తమిళ చిత్రాల్లో నటించింది. ఇండియాలోనే నెంబర్ 1 టీఆర్పీ రేటింగ్ సీరియల్‌గా ఘనత వహించిన కార్తీకదీపం సీరియల్ ఈ మధ్య కాస్త డౌన్ అవుతూ వస్తోంది.
ఇక ఈ సీరియల్ తో మంచి పాపులారిటీని సంపాదించుకున్న ప్రేమి విశ్వనాథ్ ఇప్పటివరకు ఏ సీరియల్ కు ఒప్పుకోలేదట. కానీ తాజాగా ‘దేవిక’ అనే మలయాళ సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 5 నుంచి ‘సూర్య’ టీవీలో రాత్రి 8 గంటలకు ఈ సీరియల్ ప్రసారంకానుంది. దేవిక సీరియల్ లో మోడ్రన్ లుక్ లో మోడ్రన్ డ్రెస్ ల్లో స్టైలిష్ గా కనిపించింది. ఈ సీరియల్ కు సంబంధించిన ప్రోమో ను వంటలక్క తన ఫేస్ బుక్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారగా ఇందులో వంటలక్క గెటప్ ను చూసి అందరూ షాక్ అవుతున్నారు.
మలయాళ సీరియల్ ‘దేవిక’లో ఏమాత్రం అమాయకత్వం కనిపించకుండా ఉండటంతో మన తెలుగు ప్రేక్షకులు వంటలక్క కోసమైనా భాష అర్ధం కాకపోయినా ఈ సీరియల్ ను చూడటానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.