తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని సెలబ్రిటీలలో డాక్టర్ బాబు క్యారెక్టర్ పోషించిన నిరుపమ్ పరిటాల ఒకరు. కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబుగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇటీవలే కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ పాత్ర ముగిసింది. మరి నిరుపమ్ కొత్త సీరియల్ తో ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి. ఇదిలా ఉండగా.. ఉగాది స్పెషల్ ఈవెంట్ ‘అంగరంగ వైభవంగా’లో భార్య మంజులతో పాల్గొన్నాడు నిరుపమ్.
మొన్న హోలీ వేడుకలలో మోనితతో కలిసి సూపర్ డాన్స్ చేసిన నిరుపమ్.. ఇప్పుడు ఉగాది ఈవెంట్ కోసం భార్యతో రావడం జరిగింది. తాజాగా ఉగాది ఈవెంట్ ‘అంగరంగ వైభవంగా’ ఎపిసోడ్ కి సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ అయింది. ఎల్లప్పుడూ నవ్వుతూ కనిపించే మంజూల.. ఈసారి అందరి చేత కంటతడి పెట్టించింది. ప్రస్తుతం మంజుల మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఉగాది షడ్రుచులలో ఒకటైన చేదు గురించి అడిగినప్పుడు.. తన లైఫ్ లోని చేదు అనుభవాన్ని బయట పెట్టింది మంజూల. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. “చేదు జ్ఞాపకం అంటే.. ఆరేళ్ల క్రితం అనుకుంటా.. నాకు వైరల్ ఆర్థరైటిస్ వచ్చి బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి ఏర్పడింది. చాలా బాధపడ్డాను.. అసలు నేను బతుకుతానా? లేదా? అనే డౌట్ వచ్చింది’ అని మంజుల ఎమోషనల్ అయింది. మరి పూర్తి ఎపిసోడ్ కోసం ఉగాది రోజు ఈవెంట్ చూడాల్సిందే. మరి డాక్టర్ బాబు భార్య ఎమోషనల్ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.