సాధారణంగా సీరియల్ హీరోయిన్స్ అంటే పెద్దగా గ్లామర్ షో చేయకుండా ఎప్పుడూ చీరకట్టు లేదా నిండైన డ్రెస్ లో కనిపిస్తారని అందరికి తెలుసు. కానీ.. ఈ మధ్యకాలంలో గ్లామర్ పరంగా ట్రెండ్ మారింది. సినీ హీరోయిన్స్ ఎలాగో సినిమాలలో అందాలను షో చేసి ఫ్యాన్స్ ని అలరిస్తుంటారు. ఇప్పుడు సీరియల్ హీరోయిన్స్, ఆర్టిస్టులు సైతం ఛాన్స్ దొరికితే చాలు స్టేజిపై వయ్యారాలన్నీ ఒలకబోస్తున్నారు.!
తెలుగు బుల్లితెర పాపులర్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అలాగే ఆ స్టేజిపై కనిపించే సీరియల్ ఆర్టిస్టులు, జబర్దస్త్ కమెడియన్స్ గురించి కూడా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై మోస్ట్ పాపులర్ సీరియల్స్ లో కార్తీక దీపం ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. అందులో డాక్టర్ బాబు, వంటలక్క ఇద్దరు కూతుర్లలో హిమ ఒకరు. ఈ హిమ క్యారక్టర్ ని కన్నడ బ్యూటీ కీర్తి కేశవ్ భట్ పోషిస్తూ ఆకట్టుకుంటుంది.
ఇక కార్తీక దీపంతో పాటు తెలుగులో మనసిచ్చి చూడు అనే సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే.. మనసిచ్చి చూడు సీరియల్ హీరో మహేష్ కాళిదాసుతో కలిసి ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజిపై పెర్ఫార్మన్స్ చేసింది. బ్లాక్ సారీలో కీర్తి టాప్ టు బాటమ్ అందాలన్నీ చూసి ఫ్యాన్స్ అలా ఆస్వాదిస్తున్నారు. వర్షం మూవీలోని మెల్లగా కరగని పాటకు నిజంగానే స్టేజిపై సెగలు రేపింది కీర్తి.!
ప్రస్తుతం కీర్తి హాట్ డ్యాన్స్ లేటెస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. కన్నడ సినీ ఇండస్ట్రీ నుండి వచ్చిన కీర్తి తెలుగులో నేరుగా సీరియల్స్ లో అడుగుపెట్టింది. ఇక రాగానే కార్తీక దీపం హిమగా అందరికి దగ్గరై.. ఇప్పుడు ఏకంగా మనసిచ్చి చూడు సీరియల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి ‘కార్తీక దీపం’ ఫేమ్ కీర్తి భట్ గ్లామర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.