బాహుబలి మూవీతో తెలుగు సినిమా స్థాయిని, స్టార్డమ్ ని పెంచిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. బాహుబలి అనే ఒక సామ్రాజ్యం క్రియేట్ చేసి పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ఆయన నుండి సినిమాలు లేటుగా రావచ్చు.. కానీ వస్తే బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం అని ఇదివరకే నిరూపించాడు. అయితే.. రాజమౌళి నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్ ‘RRR‘.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు డీవీవీ దానయ్య. అయితే.. మార్చి 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ప్రమోషన్స్ జరుపుతోంది. ఇక మార్చి 19న(సాయంత్రం 6 గంటలకు) ట్రిపుల్ ఆర్ బృందం.. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపనుంది.ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ప్రముఖ సినీనటుడు శివరాజ్ కుమార్ హాజరు కాబోతున్నట్లు సమాచారం. కర్ణాటకలో ఎన్టీఆర్ కి ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. తెలుగు, హిందీతో పాటుగా అన్ని భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. మరి కర్ణాటకలో జరగనున్న ప్రమోషనల్ ఈవెంట్ కోసం సీఎం రాబోతుండటంతో మూవీ యూనిట్, ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రిపుల్ ఆర్ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, సముద్రఖని లాంటి స్టార్స్ కీలకపత్రాలు పోషించారు. మరి ట్రిపుల్ ఆర్ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.