కాలంతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా అనేక మార్పులకు లోనవుతూ వస్తోంది. ఒకప్పుడు పురాణాలు.. ఇతిహాసాలతో కూడిన కథలను తెరకెక్కించాలంటే చాలా రిస్క్ అని భావించేవారు మేకర్స్. కానీ కట్ చేస్తే… ఇప్పుడందరికీ అదే కథా వస్తువుగా మారిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అరడజను వరకు ఇలాంటి మూవీలు సెట్స్‌పై ఉన్నాయి. అలా తెరకెక్కుతున్న సినిమాల్లో… ఓ ప్రాజెక్టు మేటర్ ఎంతకీ ముందుకు కదలకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
బజరంగీ బాయిజాన్, బహుబలి వంటి బ్లాక్ బాస్టర్లతో పాన్ ఇండియా లెవల్ లో పాపులారిటి తెచ్చుకున్నాడు రైటర్ విజయేంద్రప్రసాద్ తన కొడుకు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అన్ని సినిమాలకు ఆయనే కథలు అందించారు. అలాగే అప్పుడప్పుడు వేరే సినిమాలకు కూడా కథలు – స్క్రీన్ ప్లే రాస్తుంటారు. ఇందులో బాలీవుడ్ ప్రాజెక్టులు కూడా చాలా ఉన్నాయి. తాజాగా విజయేంద్రప్రసాద్ రామాయణం ఆధారంగా సీత అనే కథను సిద్ధం చేశాడు.అయితే తొలుత సీత పాత్ర కోసం కరీనా కపూర్ తో మేకర్స్ చర్చలు కూడా జరిపారు. ఆమె కూడా ఈ సినిమా చేసేందుకు సానుకూలంగానే స్పందించింది. ఈ విషయంలో నెటిజన్స్ నుండి కూడా భారీగానే వ్యతిరేకత వ్యక్తం అయ్యింది కూడా. కానీ.., ఆల్ ఆఫ్ సడెన్ గా ఇప్పుడు ఈ చిత్రంలో హీరోయిన్ మారినట్టు తెలుస్తోంది.
సీత క్యారెక్టర్ చేసేందుకు కరీనా పలు కండిషన్లు పెట్టిందట. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు కోసం దాదాపుగా 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. మామూలుగా అయితే కరీనా ఒక్కో సినిమాకు ఆరు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. కానీ సీత సినిమా చేయడం కోసం వీలైనన్ని ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి వస్తుందని.. అందుకే ఆమె దాదాపు డబుల్ ఛార్జ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.
దీంతో మేకర్స్.. కరీనా బదులుగా సీత క్యారెక్టర్ లో కంగనాను తీసుకోవాలనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. సౌత్ ప్రేక్షకులకు కరీనా అంతగా పరిచయం లేదని… కానీ కంగనా మాత్రం మణికర్ణికతో పాటు త్వరలో తలైవి సినిమాతో క్రేజ్ తెచ్చుకోబోతుందన్నది వాళ్ల అభిప్రాయంగా కనిపిస్తోంది. సో.., ఇంత పారితోషికం చెల్లించి కరీనాని పెట్టుకోవడం కన్నా.., కంగనాను సెలెక్ట్ చేసుకుంటే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారట మేకర్స్. దీంతో.., తన ప్రాజెక్ట్ తన్నుకొని పోయిన కంగనా పై కరీనా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా సీత పాత్రలో కరీనా వద్దు అన్న నెటిజన్స్ డిమాండ్ ఈ విధంగా నెరవేరింది అనమాట.