యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ రేంజ్ బాహుబలితో పూర్తిగా మారిపోయింది. దెబ్బకి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. బహుబలి2 తర్వాత సాహో సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధకపూర్‌తో జోడీ కట్టాడు. అనంతరం రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలను లైన్లో పెట్టాడు. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే. వీటితో పాటు రిసెంట్‌గా తన 25వ సినిమాను ప్రకటించాడు ప్రభాస్. దాని పేరు స్పిరిట్.
విజయ్ దేవరకొండతో అర్జున్‌రెడ్డి లాంటి భారీ హిట్ సినిమాను తీసిన సందీప్‌రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకుడు. అర్జున్ రెడ్డిని హిందీలో షాహిద్ కపూర్‌తో కబీర్ సింగ్‌గా రిమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు సందీప్. దీంతో ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేశాడు. కాగా ఈ స్పిరిట్ సినిమా కోసం బాలీవుడ్ భామ కరీనా కపూర్, కొరియన్ హీరోయిన్ ‘సాంగ్ హే కో’ను చిత్ర బృందం సంప్రదించినట్లు సమాచారం. వారిద్దరిని ఈ సినిమాలో హీరోయిన్లుగా ఫైనల్ చేసినట్లు అందుకు వారు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా అధికారికంగా చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించలేదు.