Karate Kalyani: నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిలు గురువారం రాత్రి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరి దాడికి సంబంధించిన వీడియో సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, కళ్యాణి, శ్రీకాంత్‌రెడ్డిలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటనానికి గల నిజమైన కారణాలు తెలియరాలేదు. కానీ, ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. శ్రీకాంత్ రెడ్డి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. తన పక్కలో పడుకోవాలని అడిగాడని, బొడ్డపై చెయ్యి పెట్టాడని ఆరోపించింది. అందుకే అతడి చెంప పగుల గొట్టానని వెల్లడించింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళల్ని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడని, ఎక్కడెక్కడో చేతులు వేసి మహిళల్ని అగౌరవ పరుస్తున్నాడని ఆరోపించింది. ఒంటరిగా ఉన్న అమ్మాయిలు, మహిళల్ని రెచ్చగొట్టి తన కామ కోర్కికలను తీర్చుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. తననుంచి రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని చెప్పింది.
ఇక శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కరాటే కళ్యాణి తనను లక్ష రూపాయలు అడిగిందన్నాడు. ఆ డబ్బు ఇవ్వనని తేల్చిచెప్పటంతోటే తనపై దాడి చేశారని చెప్పాడు. తాను డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్ట్‌లతో ఈ ప్రాంక్ వీడియోలు చేస్తున్నానని, కరాటే కళ్యాణి బాబీ అంటూ వ్యాంప్ పాత్రలు చేస్తే తప్పులేదు.. సినిమాల్లో ఊ అంటావా.. ఊఊ అంటావా? అంటే తప్పులేదు కానీ.. నేను మాత్రం వీడియోలు చేస్తే కొడతారా? అని ప్రశ్నించాడు.కాగా, కరాటే కళ్యాణి గురువారం రాత్రి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లింది. ప్రాంక్ వీడియోలపై అతన్ని నిలదీసింది. ‘నువ్ తీస్తున్న ఫ్రాంక్ వీడియోలు ఏంటి.. సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావ్..? అంటూ అతని చెంపపై కొట్టింది. అనంతరం ఆమె పక్కనే ఉన్న ఓ వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి చొక్కా పెట్టుకుని కొట్టాడు. దీంతో గొడవ పెద్దదైంది. తిరగబడ్డ శ్రీకాంత్ రెడ్డి తనని కొట్టిన వ్యక్తితో పాటు చంటి బిడ్డను ఎత్తుకుని ఉన్న కరాటే కళ్యాణి చెంప పగలకొట్టాడు. ఈ ఘర్షణలో కరాటే కళ్యాణి చంటి బిడ్డతో సహా కిందపడిపోయింది. ఆ తరువాత చుట్టూ ఉన్న వాళ్లు శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసి.. విపరీతంగా కొట్టారు. కింద పడిపోయిన కరాటే కళ్యాణి మళ్లీ లేచి అతన్ని పరుగెట్టించి, గుడ్డలూడదీసి మరీ కొట్టింది. అంతేకాదు! ల***కొడుకా!.. అంటూ ఎస్ఆర్ నగర్ నుంచి మధురానగర్ వరకూ అతన్ని పరుగుపెట్టించి మరీ దాడి చేసింది. మరి, కరాటే కళ్యాణి, శ్రీకాంత్ రెడ్డిల వివాదంలో మీరు తప్పెవరిదనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Karate Kalyani: నడి రోడ్డు మీద యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని కొట్టిన కరాటే కళ్యాణి.. వీడియో వైరల్!