నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య చోటు చేసుకున్న వివాదం చిలికి చిలికి గాలివాన చందగా పెద్దదిగా మారింది. ఈ వివాదం కొనసాగుతుండగానే.. కరాటే కళ్యాణి మీద వరుస ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. ఓ వ్యక్తి కరాటే కళ్యాణి వల్ల తనకు ప్రాణ హాని ఉందని తెలపగా.. ప్రస్తుతం ఆమె పెంచుకుంటున్న చిన్నారులకు సంబంధించి పలు ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. గత కొంతకాలంగా కరాటే కళ్యాణి ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచిందని ఆమెపై ఫిర్యాదు రావడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, పోలీసులు ఆదివారం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అధికారులు తెలిపిన మేరకు.. కరాటే కళ్యాణి గత కొన్నేళ్ళుగా అక్రమంగా పిల్లలను తీసుకువచ్చి ఇంట్లో ఉంచుతుందని 1098 నెంబర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆదివారం.. ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని రాజీవ్‌నగర్‌కాలనీలో శ్రీలక్ష్మి నిలయం అపార్ట్‌మెంట్స్‌కు ఆదివారం వచ్చారు.
అయితే అధికారులు వచ్చిన సమయంలో కరాటే కళ్యాణి ఇంట్లో లేదు. ఆమె తల్లి మాత్రమే ఉన్నారు. ఆమె బయటకు వెళ్లిందని తెలిపింది. ఇక తాజాగా సోమవారం కరాటే కళ్యాణి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. తను పెంచుకుంటున్న కుమార్తెని తీసుకుని కరాటే కళ్యాణి నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్లిందని.. ఇప్పటి వరకు తిరిగి రాలేదని తెలిపింది. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుందని.. తన కుమార్తె గురించి ఆందోళనగా ఉందని వాపోయింది. 24 గంటలు గడిచినా కరాటే కళ్యాణి ఇంకా ఇంటికి రాలేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక తన బిడ్డ మీద కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కరాటే కళ్యాణి తల్లి వాపోయింది. తన కుమార్తె చట్ట ప్రకారమే పిల్లలను దత్తత తీసుకుందని.. వెల్లడించింది. అంతేకాక శ్రీకాంత్ రెడ్డి వల్ల తన బిడ్డకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరి కరాటే కళ్యాణి ఎక్కడికి వెళ్లినట్లు.. ఆమె దగ్గర ఉన్న చిన్నారులను చట్ట ప్రకారమే దత్తత తీసుకుందా లేదా అనే వివరాలు తెలియాలంటే.. ఆమె స్పందించాలి. మరి ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Karate Kalyani: కరాటే కళ్యాణిపై మరో బాధితుడి ఫిర్యాదు!ఇక కరాటే కళ్యాణి, శ్రీకాంత్ రెడ్డి మధ్య జరిగిన వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ప్రాంక్ వీడియోల పేరుతో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసింది కరాటే కళ్యాణి. శ్రీకాంత్ కూడా ఆమెపై చేయి చేసుకున్నాడు. వీరిద్దరి మద్య గొడవలు చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ వివాదం ముదిరి ఇరువురిపై కేసులు నమోదు అయ్యాయి. తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కంప్లైట్ చేస్తే ఇరువురిపై ఒకే రకమైన కేసులు పెట్టి శ్రీకాంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని ఎస్‌ఆర్ నగర్ సీఐ సైదులుపై కల్యాణి ఫైర్ అయింది. తర్వాత మీడియాతో మాట్లాడిన కల్యాణి సీఐపై తీవ్రంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రగడ కొనసాగుతూనే ఉండగా.. కరాటే కళ్యాణి తల్లి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.