హైదరాబాద్ నగరంలోని శివశక్తి ఫౌండేషన్ పై సినీనటి కరాటే కళ్యాణి తీవ్రంగా ఆరోపించింది. తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. ‘శివశక్తి ఫౌండేషన్.. అనేది 2017లో ప్రారంభించిన 9 నెలలకే ఫండ్ రైసింగ్ పేరుతో 1 కోటి రూపాయలు తీసుకున్నారు. సరే ఆ డబ్బుతో ఆఫీస్ ఓపెన్ చేశామన్నారు.. ఆ ఆఫీస్ ఓపెనింగ్ కి మేం కూడా వెళ్ళాము. తర్వాత మూడు నెలలకే జాతీయ స్థాయి అంటూ ఫండ్స్ అడిగారు. మేం షాక్ అయిపోయి అసలు ఇదేంటీ అప్పుడే అని.. కూపీ లాగేసరికి వాళ్ళు చేస్తున్న ఫ్రాడ్ అంతా బయటపడింది.
డబ్బులు తీసుకుంటున్నారు.. ఎవరైనా ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారు. అలాగే అడిగిన వారిపై ఫేస్ బుక్ లో నీచంగా పోస్టులు పెడుతున్నారు. ఇదంతా ఏంటని అడిగితే మమ్మల్ని కూడా ఘోరంగా ట్రోల్ చేశారు. ఈరోజు ఈడీ కూడా ఫౌండేషన్ నిర్వాహకుల పై ఇంక్వైరీ వేశారు. ఈ శివశక్తి ఫౌండేషన్ ప్రధాన సూత్రధారులు అధ్యక్షుడు కరుణాకర్ సుగ్గున, డైరెక్టర్లు దేవిరెడ్డి ఆనందకుమార్ రెడ్డి, సునీతారెడ్డి. వీరు ముగ్గురు మరికొందరితో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఫౌండేషన్ విరాళాలను సొంత అవసరాలకు మళ్లించారని.. సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి ఫ్రాడ్ కు పాల్పడ్డారు. ప్రస్తుతం వీరి ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ కార్యాలయం ఏర్పాటుకు రెండున్నర కోట్ల రూపాయల విరాళాలు వసూలు చేశారన్నారు. శివశక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు, డైరెక్టర్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. శివశక్తి ఫౌండేషన్ అక్రమాలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అలాగే శివశక్తి ఫౌండేషన్‌కు హిందువులు ఎవరూ విరాళాలు ఇవ్వొద్దు’ అంటూ ఆమె విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం కళ్యాణి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ శివశక్తి ఫౌండేషన్ ఫ్రాడ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.