కరాటే కళ్యాణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. చిన్న, చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది. ఇక కృష్ణ సినిమాలో ఆమె చేసిన పాత్ర.. కళ్యాణికి గుర్తింపు ఇచ్చింది. ఇప్పటికి కూడా ఆమె కనిపిస్తే.. చాలు.. బాబీ అంటారు ప్రేక్షకులు. ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో కూడా సందడి చేసింది కరాటే కళ్యాణి. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ.. కెరీర్‌లో ముందుకు సాగుతోంది. కొన్ని నెలల క్రితం యూట్యూబర్‌తో.. కరాటే కళ్యాణి గొడవ ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో తాజాగా కరాటే కళ్యాణి.. సుమన్ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న చేదు, భయానక అనుభవాల గురించి చెప్పుకొచ్చింది
సినిమాలో కరాటే కళ్యాణి.. ఎక్కువగా వ్యాంప్ తరహా పాత్రలే చేస్తుంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘బతుకుతెరువు కోసం నేను సినిమాల్లో నటిస్తున్నాను. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాను. చాలా మంది నాలో బాబినే చూశారు. కానీ నాణేనికి మరోవైపు చాలా మందికి తెలియదు. రియల్ లైఫ్‌లో నేను చాలా మందికి సాయం చేస్తాను. వారంతా నాకు చాలా మర్యాద ఇస్తారు. దండం పెడతారు. కావాలంటే నాతో రండి చూపిస్తాను. ఇక నేను సింగింగ్, హరికథ, డ్యాన్స్, యాంకరింగ్, జింగిల్స్ పాడటం వంటివి అన్ని చేశాను. ఇండస్ట్రీలోకి వచ్చాక.. బతకడం కోసం.. డబ్బింగ్ చెప్పడం.. జింగిల్స్ పాడటం చేశాను. ఎంతో కష్టపడ్డాను’’ అని చెప్పుకొచ్చింది కరాటే కళ్యాణి.
అయితే తనకు ఇండస్ట్రీలో చేదు అనుభవాలు ఎదురవ్వకపోవడానికి ప్రధాన కారణం తనకు తెలిసిన కరాటే విద్య అన్నది కళ్యాణి. ‘‘నాతో తప్పుగా ప్రవర్తించిన చాలా మందిని చితక్కొట్టాను. అందుకే నాకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదు. ఇక ప్రసుత్తం భర్త నుంచి విడిపోయాను. అతను నన్ను పెట్టిన టార్చర్ మాటల్లో వర్ణించలేను. ఎంత పీక్స్‌కు వెళ్లింది అంటే.. ఓ రోజు.. నా భర్త తాగి.. బేగంపేట దగ్గర.. నడి రోడ్డు మీద .. నా బట్టలు లాగేశాడు. అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద నాకు ద్రౌపది వస్త్రాపహరణం అయ్యింది. ఆ తర్వాత కూడా తను మారలేదు. తాగి వచ్చి చాలా చిత్ర హింసలు పెట్టాడు. ఇక నాకు పెళ్లి మీద విరక్తి కలిసింది. భర్త నుంచి దూరంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చింది.
కానీ ‘‘మా అమ్మ ఇప్పటికి నీకు ఓతోడు కావాలి.. పెళ్లి చేసుకోవాలి అని కోరుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. నేను కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నాను.. చూద్దాం.. విధి రాత ఎలా ఉందో’’ అని చెప్పుకొచ్చింది కళ్యాణి. అయితే తనకు కరాటే వచ్చినా సరే.. భర్త అనే గౌరవంతో.. అతడిని కొట్టలేదు అని తెలిపింది. ఈ వార్త చూసిన వారు.. పైకి ఎంతో స్ట్రాంగ్‌గా కనిపించే.. కళ్యాణి జీవితంలో ఇంత విషాదం ఉందా.. నిజంగా మీరు చాలా స్ట్రాంగ్ మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.