Karate Kalyani: ఆరోపణలు, ప్రత్యారోపణలతో కరాటే కళ్యాణి, శ్రీకాంత్ రెడ్డి మధ్య వివాదం హద్దులు దాటుతోంది. ఇప్పటికే ఒకరిపై, ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. జరిగిన దాంట్లో తన తప్పు లేదని, న్యాయం తనవైపే ఉందని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కరాటే కళ్యాణి మీడియా ముందుకు వచ్చారు. శ్రీకాంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా ముందు కన్నీరు మున్నీరుగా విలపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ వాడు తప్పించుకోవటానికి నాపై ఎలిగేషన్స్ చేస్తున్నాడు. వాడు చేసిన ఎలిగేషన్స్‌లో వన్ పర్సెంట్ నిజమున్నా మీడియా ఏం చెబితే అది చేస్తా. నేను ఆడ వాళ్లకు సపోర్ట్ చేసి మోసపోయా. కొన్ని మీడియా సంస్థలు వెధవలకు సపోర్ట్ చేస్తున్నాయి. సొంత అక్కలతో, చెల్లెళ్లతో ఇలా చేస్తాడా?.. పిల్లలు పాడైపోతే నేను ఊరుకోను. నన్ను బెదిరించాడు. బయట ఎలా తిరుగుతావో చూస్తానన్నాడు. వాడు పరమ 420’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కళ్యాణి చేతిలో దెబ్బలు తిన్న శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం ఎస్‌ఆర్ నగర్‌లో పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశాడు. అటెంప్ట్ టు మర్డర్, బ్లాక్ మేయిలింగ్ కేసు పెట్టాడు. అనంతరం ఓ మీడియాతో మాట్లాడుతూ.. తనకు కరాటే కళ్యాణి నుంచి ప్రాణహాని ఉందని, తనకు ఏమైనా జరిగితే ఆమెదే బాధ్యతని అన్నారు. ఆమెపై అటెంప్ట్ టు మర్డర్, బ్లాక్ మేయిలింగ్ కేసులు పెట్టినట్లు తెలిపారు. కళ్యాణితో గతంలో తనకు ఎలాంటి గొడవలు లేవని, నిన్నే మొదటిసారి ఆమెను కలిశానని చెప్పాడు. తన ఇంటి దగ్గరకు వచ్చి, గొడవ పెట్టుకుందన్నాడు. తనపై దాడి చేయటంతోటే తాను కూడా దాడి చేశానని అన్నాడు. ఆమె తనను లక్ష రూపాయలు డబ్బులు అడిగిందని, డబ్బులు ఇవ్వనని చెప్పటంతోటే ఇవన్నీ జరిగాయని ఆరోపించాడు. కరాటే కళ్యాణి కూడా బాబి లాంటివి చేయలేదా అని ప్రశ్నించాడు. సినిమాల్లో ఊ అంటావా.. ఊఊ అంటావా?.. ఆసిక్ బాన్ ఆయా అన్న పాటలు ఉంటే తప్పులేదు కానీ.. నేను మాత్రం వీడియోలు చేస్తే తప్పా అని ప్రశ్నించాడు. తాను కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలు మాత్రమే చేస్తానని చెప్పాడు. జూనియర్ ఆర్టిస్టులతో పేయిడ్ వీడియోలు చేస్తానని, తాను కూడా ఓ ఆర్టిస్ట్ కావాలన్న ఉద్దేశ్యంతోనే చేస్తున్నానని అన్నాడు.
కాగా, కరాటే కళ్యాణి గురువారం రాత్రి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లింది. ప్రాంక్ వీడియోలపై అతన్ని నిలదీసింది. ‘నువ్ తీస్తున్న ఫ్రాంక్ వీడియోలు ఏంటి.. సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావ్..? అంటూ అతని చెంపపై కొట్టింది. అనంతరం ఆమె పక్కనే ఉన్న ఓ వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి చొక్కా పెట్టుకుని కొట్టాడు. దీంతో గొడవ పెద్దదైంది. తిరగబడ్డ శ్రీకాంత్ రెడ్డి తనని కొట్టిన వ్యక్తితో పాటు చంటి బిడ్డను ఎత్తుకుని ఉన్న కరాటే కళ్యాణి చెంప పగలకొట్టాడు. ఈ ఘర్షణలో కరాటే కళ్యాణి చంటి బిడ్డతో సహా కిందపడిపోయింది. ఆ తరువాత చుట్టూ ఉన్న వాళ్లు శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసి.. విపరీతంగా కొట్టారు. కింద పడిపోయిన కరాటే కళ్యాణి మళ్లీ లేచి అతన్ని పరుగెట్టించి, గుడ్డలూడదీసి మరీ కొట్టింది. అంతేకాదు! ల***కొడుకా!.. అంటూ ఎస్ఆర్ నగర్ నుంచి మధురానగర్ వరకూ అతన్ని పరుగుపెట్టించి మరీ దాడి చేసింది. మరి, కరాటే కళ్యాణి ఆవేదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Srikanth Reddy : దాడి తర్వాత శ్రీకాంత్ రెడ్డి వీడియో.. కరాటే కళ్యాణి నుంచి ప్రాణహాని ఉంది!