Karate Kalyani: నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిల వివాదం ఇప్పటిలో సద్దుమణిగేలా కనిపించటం లేదు. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకున్నారు. తీవ్రస్థాయిలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మీడియా వేదికగా కూడా ఒకరినొకరు నిందించుకుంటున్నారు. తాజాగా, ఓ న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్‌లో కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి తిట్టుకున్నారు. ఈ సందర్భంగా కళ్యాణి, శ్రీకాంత్‌పై విరుచుకుపడ్డారు. ‘‘ నేను వెళ్లి తన్నొస్తా వాడ్ని. నేను వదలను వాడ్ని. వాడి వల్ల నా కాలు వెంట్రుక కూడా తెగదు. రేయ్! నీకు దమ్ముంటే.. నువ్వు ఏమన్నావో దాని మీద కట్టుబడి ఉండు. ఈ కేసు కోసం చావడానికైనా సిద్ధమే..బాబీ అనేది సినిమా క్యారెక్టర్.. సినిమా క్యారెక్టర్‌కు నువ్వు చేసే బూతులకు ఒకటేనా.. మా సినిమా పరిశ్రమను అంటే ఒప్పుకోము. వాడికి సినిమా పరిశ్రమ గురించి మాట్లాడే అర్హత లేదు’’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, కరాటే కళ్యాణి గురువారం రాత్రి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లింది. ప్రాంక్ వీడియోలపై అతన్ని నిలదీసింది. ‘నువ్ తీస్తున్న ఫ్రాంక్ వీడియోలు ఏంటి.. సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావ్..? అంటూ అతని చెంపపై కొట్టింది. అనంతరం ఆమె పక్కనే ఉన్న ఓ వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి చొక్కా పెట్టుకుని కొట్టాడు. దీంతో గొడవ పెద్దదైంది. తిరగబడ్డ శ్రీకాంత్ రెడ్డి తనని కొట్టిన వ్యక్తితో పాటు చంటి బిడ్డను ఎత్తుకుని ఉన్న కరాటే కళ్యాణి చెంప పగలకొట్టాడు. ఈ ఘర్షణలో కరాటే కళ్యాణి చంటి బిడ్డతో సహా కిందపడిపోయింది. ఆ తరువాత చుట్టూ ఉన్న వాళ్లు శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసి.. విపరీతంగా కొట్టారు. కింద పడిపోయిన కరాటే కళ్యాణి మళ్లీ లేచి అతన్ని పరుగెట్టించి, గుడ్డలూడదీసి మరీ కొట్టింది. అంతేకాదు! ల***కొడుకా!.. అంటూ ఎస్ఆర్ నగర్ నుంచి మధురానగర్ వరకూ అతన్ని పరుగుపెట్టించి మరీ దాడి చేసింది.
ఇవి కూడా చదవండి : Karate Kalyani: నేను మోసపోయా.. శ్రీకాంత్‌రెడ్డి 420 : కరాటే కళ్యాణి