టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలు లేవురా.. ఉన్నదొక్కటే ఇండస్ట్రీ.. అది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ’ అని ప్రూవ్ చేసిన వ్యక్తి రాజమౌళి. అంతకు ముందు వరకూ ఈ తేడాలు ఉన్నాయి. ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో ఇక ఇండియా అంతా ఒకటే ఇండస్ట్రీ అనే నినాదం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్, సాహో, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఎల్లలు దాటి ఈ నినాదాన్ని బలం చేకూర్చాయి. అయితే బాలీవుడ్‌పై సౌత్ మూవీస్ డామినేషన్ తట్టుకోలేని కొందరు బాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు డిఫెన్స్‌లో పడ్దారు. “మాకు ఎవరూ పోటీ కాదు, మాకు మేమే పోటీ, మాకు మాతోనే పోటీ, వుయ్ ఆర్ నంబర్ వన్, మేము ఎప్పుడూ నంబర్ వన్నే” అంటూ ఆ మధ్య అభద్రతా భావంతో కూడిన అహంతో వచ్చిన ఫ్రస్ట్రేషన్‌ను బయటపెట్టాడో బాలీవుడ్ హీరో.
జాన్ అబ్రహం మాత్రమే కాదు ఇతనిలా చాలా మంది నటులు తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనేది బాలీవుడ్ మీడియాలో ఒక వెర్షను ఉంది. చాలా కాలంగా బాలీవుడ్‌లో పెద్ద హిట్లు లేవు. వరుస ఫ్లాపులతో బాలీవుడ్ అతలాకుతలం అయిపోయింది. ఆ సమయంలో సౌత్ సినిమాలు బాలీవుడ్‌ని ఏలడం మొదలుపెట్టాయి. దీంతో ఇక బాలీవుడ్ పని అయిపోయిందని అనడం మొదలుపెట్టారు. ఈ మాటలకి కరణ్ జోహార్ హర్ట్ అయినట్టున్నారు కాబోలు, బాలీవుడ్‌కి ఆ పరిస్థితి రాదని అన్నారు. తాజాగా ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీ పని అయిపోయిందని, ఖతమైపోయిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి అర్ధం లేదని, అలా అనే వాళ్ళది చెత్త వాగుడని అన్నారు. మంచి సినిమాలు ఎప్పుడూ ఆడతాయని, కంటెంట్ బాగోపోతే అస్సలు ఆడవని అన్నారు. గంగూబాయ్ కతియావాడి, భూల్ భూలయ్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని అన్నారు.
ఇప్పుడు సౌత్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వాటి ముందు హిందీ సినిమాల హిట్లు కనబడట్లేదని కరణ్ జోహార్ కామెంట్స్ చేశారు. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు బాలీవుడ్ సినిమాలను కప్పేశాయని, అయితే పరిస్థితి ఇప్పుడు మారుతుందని, మా దగ్గర పెద్ద సినిమాలు ఉన్నాయని, మళ్ళీ బాలీవుడ్‌కి పూర్వ వైభవం వస్తుందని అన్నారు. ఏది ఏమైనా గానీ ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని, సౌత్ యాక్టర్స్‌ని చులకనగా చూసిన బాలీవుడ్ గడ్డ మీద మన వాళ్ళు జండా పాతేశారు. ఇప్పుడు మన వాళ్ళ సత్తా చూసి కొంత అభద్రతాభావానికి గురయ్యారన్నది నిజం. అయితే ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గర్వం చూపించడం మంచి పరిణామం కాదు. ఎందుకంటే కొంతమంది బాలీవుడ్ దర్శకులు కూడా మన వాళ్ళతో సినిమాలు చేసేందుకు సిద్దంగా ఉన్నారు.
ప్రభాస్‌తో.. ఆది పురుషుడు, పురుషోత్తముడు అయిన శ్రీరామ చంద్రమూర్తి చరిత్రని సినిమాగా తెరకెక్కిస్తున్నారు. కాబట్టి ఈ ఆదిపురుష్ సినిమాతో బాలీవుడ్, టాలీవుడ్ టెక్నీషియన్స్ అని కాకుండా, ఇండియన్ టెక్నీషియన్స్ అని అనిపించుకుంటారు. ఆ రాముడి సినిమాతో బాలీవుడ్, టాలీవుడ్ బేధాలు పూర్తిగా తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయన్నది వాస్తవం. అక్కడక్కడ జాన్ అబ్రహంలా అక్కసుతో రగిలిపోయే వాళ్ళు ఉండచ్చుగాక.. కానీ నిజయితీగా మాట్లాడే కరణ్ జోహార్ లాంటి వాళ్ళు కూడా ఉంటారనేది మనం గుర్తించాలి.
బాలీవుడ్ దృష్టిలో బాలీవుడ్ మాత్రమే ఇండియన్ సినిమా అనుకున్నా గానీ మన దృష్టిలో బాలీవుడ్ సినిమా అయినా, టాలీవుడ్ సినిమా అయినా ఇండియన్ సినిమానే. బాగుంటే చూస్తాం. లేదంటే చూడ్డం మానేస్తాం. వుయార్ ఫిల్మ్ లవర్స్ అంతే. ఈ విషయంలో రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. బాలీవుడ్, టాలీవుడ్ సరిహద్దులు చెరిపేసి ఇండియన్ సినిమా అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరి కరణ్ జోహార్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.