సెలబ్రిటీ ఎవరైనా సరే కాస్త ఫేమ్ తెచ్చుకుంటే చాలు వాళ్లపై కచ్చితంగా విమర్శలు వస్తాయి. కాకపోతే అవి తమ ప్రొఫెషన్ వరకు అయితే ఓకే గానీ.. వ్యక్తిగతంగా మారితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైన వారు చాలామందే ఉన్నారు. ఇక హీరోయిన్ రష్మికపై కూడా ఈ మధ్య కాలంలో బాగా విమర్శలు ఎక్కువయ్యాయి. స్వయంగా ఈ విషయాన్ని ఆమెనే బయటపెట్టింది. హీరోయిన్ గా వచ్చి దాదాపు ఆరేళ్లకు పైనే అయిపోయింది. ఇన్నేళ్లపాటు రెస్పాండ్ కానీ ఆమె.. మొన్న ఇన్ స్టాలో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది. ఇప్పుడు దానికి ‘కాంతార’ సినిమానే కారణమనే మాట వినిపిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ రష్మిక అనగానే ఫస్ట్ విజయ్ దేవరకొండనే చాలామందికి గుర్తొస్తాడు. ఎందుకంటే ‘గీతగోవిందం’ హిట్ కొట్టారు. బెస్ట్ పెయిర్ అనిపించుకున్నారు. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ మూవీ కూడా చేశారు. సినిమల సంగతి పక్కనబెడితే వీళ్లిద్దరూ రిలేషన్ లో ఉన్నారని ఎప్పటినుంచో టాక్ ఉంది. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇదంతా పక్కనబెడితే రష్మిక కర్ణాటకకు చెందిన అమ్మాయి. హీరోయిన్ గా ఫస్ట్ చేసిన మూవీ ‘కిరిక్ పార్టీ’. ఇందులో రిషభ్ శెట్టి హీరోగా నటించాడు. ఇక డైరెక్టర్ రిషభ్ శెట్టి. అవును ‘కాంతార’ హీరో కమ్ డైరెక్టర్ గా చేసిన రిషభ్ శెట్టినే ‘కిరిక్ పార్టీ’ కూడా డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా తర్వాత రక్షిత్-రష్మిక ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల దాన్ని బ్రేక్ చేసుకున్నారు.
ఇక ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. కన్నడలో పెద్దగా సినిమాలు చేయట్లేదు. తెలుగు, తమిళ, హిందీలో ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా విమానశ్రయంలో కనిపించిన రష్మికకు.. ‘కాంతార’ సినిమా చూశారా అని రిపోర్టర్ల నుంచి ప్రశ్న ఎదురైంది. ‘చూడలేదు, త్వరలో చూస్తాను’ అని ఆమె చెప్పింది. దీంతో ఆమెపై కన్నడ నెటిజన్లు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. స్టార్ హీరోయిన్ అయిపోయేసరికి ఆమె మూలాలు మర్చిపోయిందని, ప్రపంచం మెచ్చిన ‘కాంతార’ని ఆమె చూడకపోవడం ఏంటి? అని రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో తనపై వచ్చిన, వస్తున్న నెగిటివిటీ కారణంతో రష్మిక అంత పెద్ద ఎమోషనల్ పోస్ట్ పెట్టిందని మాట్లాడుకుంటున్నారు.