‘కాంతార‘ ఈ ఏడాది ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన కన్నడ సినిమా. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ భాషల్లోకి డబ్ అయిన కాంతార.. విడుదలైన అన్నిచోట్లా అద్భుతమైన టాక్, కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెరకెక్కించి హీరోగా నటించిన రిషబ్ శెట్టికి దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్.. సినిమా నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారికి ఊహించని ప్రాఫిట్స్ వచ్చి చేరాయి. అదీగాక ఫస్ట్ డే ఎన్ని థియేటర్స్ లో విడుదలైందో.. అన్ని థియేటర్స్ లోను కాంతార 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇక IMDb రేటింగ్స్ లో కూడా 8.9 రేటింగ్ తో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది.
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా కాంతార మూవీ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటిటి స్ట్రీమింగ్ మొదలైంది. అయితే.. థియేటర్స్ లో భారీ హైప్ తో.. రిపీట్ ఆడియెన్స్ తో కలెక్షన్స్ సునామి సృష్టించిన కాంతార మూవీని.. ఓటిటిలో చూశాక ప్రేక్షకులు షాకింగ్ రివ్యూ ఇస్తున్నారు. థియేటర్స్ లో చూసి కాంతార మూవీని ఏ స్థాయిలో పొగడ్తలతో ముంచెత్తారో.. ఇప్పుడు అదే కాంతార మూవీని అసలు ఏముందంటూ విమర్శిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటిటిలో రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా.. ఏం బాలేదని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు ఆడియెన్స్. అవును.. కాంతారని ఓటిటిలో చూసి పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు.
మరి కాంతారకు సంబంధించి థియేటర్లలో ఏం మాయ జరిగింది..? ఓటిటిలోకి వచ్చేసరికి ఏం కొరవడింది? అనే విషయంపై ఆరా తీయగా.. కేవలం క్లైమాక్స్ ఒక్కటే సినిమాకి ఆయువుపట్టు అని అంటున్నారు. మిగతా సినిమా అంతా ఇదివరకే ఎన్నో సినిమాలలో చూసినట్లే ఉందని.. తెలుగులో రంగస్థలం సినిమా లైన్ నే కాంతారలో మాక్సిమమ్ కంటిన్యూ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక.. సాంగ్స్ పరంగా ఓకే అనుకున్నా, కథా కథనాలు కొత్తగా లేవని చాలా ల్యాగ్ అనిపిస్తుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వరాహ రూపం సాంగ్, భూతకోల సంప్రదాయం, క్లైమాక్స్ మినహాయిస్తే సినిమాని ఈజీగా పక్కన పెట్టేయొచ్చని బాహాటంగా చెబుతుండటం గమనార్హం. కానీ.. ఇప్పుడేం లాభం ఆల్రెడీ సినిమా బడ్జెట్ కి 25 ఇంతలు ఎక్కువే రాబట్టుకుంది.
కర్ణాటకలోని పుంజర్లి అనే తెగకు సంబంధించి నేపథ్యాన్ని ఎంచుకున్నారు దర్శకనిర్మాతలు.. వారి లైఫ్ స్టైల్ ని, వారి సంస్కృతి, సంప్రదాయాలు ఎందుకు బయట ప్రపంచానికి తెలియకుండా కనుమరుగు అయ్యాయి అనే విషయాలు ఏమాత్రం చూపించలేదు. అదీగాక పుంజర్లి తెగవారు పూజించే వరాహ మూర్తి దైవాన్ని, భూతకోల నేపథ్యాన్ని కమర్షియల్ సినిమా కోసం తెలివిగా ఉపయోగించుకున్నారని కొందరి అభిప్రాయం. అటు పూర్తిగా దైవాన్ని చూపించింది లేదు.. కానీ, పేరుకు డివైన్ హిట్ అని ప్రచారం చేసుకున్నారని, సినిమాలో ఎగబడి చూసేంత మ్యాటర్ ఏం లేదని కుండ బద్దలు కొట్టేస్తున్నారు ఓటిటి ఆడియెన్స్. చూడాలి కాంతార తుళు వెర్షన్ డిసెంబర్ 2న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. మరి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో!
putting an end to all the wait!!! 🤯#KantaraOnPrime, out tomorrow@hombalefilms @shetty_rishab @VKiragandur @gowda_sapthami @AJANEESHB @actorkishore pic.twitter.com/HBsEAGNRbU
— prime video IN (@PrimeVideoIN) November 23, 2022