సోషల్ మీడియాలో, ప్రేక్షకుల మధ్య ఈ మధ్య కాలంలో బాగా చర్చనీయాంశమైన సినిమా ‘కాంతార’. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఓ కన్నడ సినిమా ఈ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంటుంది. వసూళ్లు సాధిస్తుందని.. అందులో చేసిన యాక్టర్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరూ అనుకుని ఉండరు. కానీ దాన్ని రియాలిటీలో ప్రూవ్ చేసింది ‘కాంతార’. ఈ ఏడాది ‘కేజీఎఫ్ 2’, ‘చార్లీ’, ‘విక్రాంత్ రోణ’.. కన్నడ సినిమా సత్తా ఏంటో చూపించాయి. ఇప్పుడు ‘కాంతార’.. దాన్ని మరింత ఎత్తుకి తీసుకెళ్లింది. ఇక ఈ మూవీ సీక్వెల్ గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది!
ఇక వివరాల్లోకి వెళ్తే.. అడవి బ్యాక్ డ్రాప్ లో కన్నడ సంప్రదాయ కళల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘కాంతార’. రిషబ్ శెట్టి.. తానే దర్శకత్వం వహించి హీరోగా నటించాడు. చెప్పాలంటే సినిమాలో కొన్ని సీన్స్ బోర్ కొడతాయి కానీ క్లైమాక్స్ లో చివరి పదిహేను నిమిషాల ఫెర్ఫామెన్స్ తో రిషబ్ వాటన్నింటిని మర్చిపోయేలా చేశాడు. ఆడియెన్స్.. ఓ అద్భుతమైన సినిమా చూశామనే ఫీల్ తో బయటకొచ్చేలా చేశాడు. ఇక తెలుగులో ఈ సినిమాని అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేశారు. సినిమా ఇక్కడ కూడా సక్సెస్ కావడంతో.. తాజాగా ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రమంలోనే మాట్లాడుతూ.. అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భూమి మీద ఆశ, దైవ ధిక్కారం.. ఈ రెండూ వరాహ పురాణంలోని హిరణ్యాక్షుడి లక్షణాలు. ఇక్కడున్న విలన్ కి ప్రధానంగా ఉన్నవి ఆ రెండు గుణాలు. అసుర లక్షణాల్లో హింస కూడా ప్రధానమైనది. అది విలన్ కి ఎలానూ ఉంటుంది. అసుర సంహారం అయిన వెంటనే విష్ణువు అవతార పరిసమాప్తి చేసే ఘట్టాన్ని స్ఫురించేలా ‘కాంతార’ క్లైమాక్స్ ఎండ్ అవుతుంది. మళ్లీ నరసింహావతారంతో సీక్వెల్ ఉంటుందేమో అన్నట్టుగా హీరోయిన్ గర్భంపై కెమెరా ప్యాన్ చేసి చివరి షాట్ ఆపారు. దీంతో సీక్వెల్ కి హింట్ ఇచ్చినట్లయింది. ఇక తాజాగా ఈవెంట్ లో మాట్లాడుతూ.. రిషబ్ శెట్టి, గీతా ఆర్ట్స్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని అల్లు అరవింద్ రివీల్ చేశారు. దీంతో ‘కాంతార 2’.. గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేయనుందనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయమై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.