కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో ‘కేజీఎఫ్’. అదేంటి ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి కదా.. మరో సినిమా అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే శాండల్ వుడ్ గురించి కొన్నేళ్ల ముందు వరకు పెద్దగా ఎవరికీ తెలీదు. ఎప్పుడైతే కేజీఎఫ్ తొలి పార్ట్ విడుదలైందో యావత్ దేశం ఆ సినిమా గురించే మాట్లాడుకుంది. దీంతో కన్నడ దర్శకులు.. భారీ బడ్జెట్ సినిమాల తీయడంలో శ్రద్ధ చూపిస్తున్నారు. కన్నడ హీరోలు సైతం పాన్ ఇండియా లెవల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. అలా రాబోతున్న మూవీనే ‘కబ్జా’. తాజాగా ఈ చిత్ర తెలుగు టీజర్ ని విడుదల చేయగా, నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉపేంద్ర అంటే ఇప్పటి జనరేషన్ వాళ్లకు తెలీకపోవచ్చు. కానీ 90ల్లో పుట్టిన వాళ్లని అడగండి.. ఉపేంద్ర అంటే ఏంటో చెబుతారు. ‘అర్జున్ రెడ్డి’ తరహా చిత్రాలు అప్పట్లోనే తీసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న ఉపేంద్ర త్వరలో.. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసేలా కనిపిస్తున్నాడు. కబ్జా టీజర్ చూస్తుంటే అది అనిపిస్తోంది. ఇది మరో ‘కేజీఎఫ్’ కాబోతుందని అర్ధమవుతోంది. 1942 సమయంలో ఓ ఇండియన్ గ్యాంగ్ స్టర్ ప్రయాణమే ‘కబ్జా’ స్టోరీ. ఈ టీజర్ లోని ప్రతి సీను, ప్రతీ షాట్ చూస్తుంటే కేజీఎఫ్ చిత్రమే కళ్లముందు మెదలాడుతోంది.
ఈ సినిమా డైరెక్టర్ ఆర్.చంద్రు కూడా.. కేజీఎఫ్ నుంచి స్పూర్తి పొందినట్లు కనిపిస్తోంది. అయితే విజువల్స్ మాత్రం అదిరిపోయాయి. ముఖ్యంగా ఆ ఎడిటింగ్ చూస్తుంటే చాలా గ్రాండ్ స్కేల్ లో, భారీ బడ్జెట్ తో తీశారు. ఇందులో హీరోగా ఉపేంద్ర చేస్తుండగా, కీలక పాత్రలో సుదీప్ కనిపించారు. వీళ్ల క్యాస్టూమ్స్ దగ్గర నుంచి యాక్టింగ్ వరకు కేక పుట్టిస్తున్నారు. ఇక మరో ముఖ్య పాత్రలో శ్రియ నటిస్తోంది. ఓవరాల్ గా టీజర్ చూస్తుంటే కేజీఎఫ్ సినిమానే గుర్తొస్తుంది. మరి ఆ సినిమా రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు వసూలు చేస్తుందేమో చూడాలి. మరి కబ్జా టీజర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న KGF-2 అక్కడ మాత్రం ప్లాప్..