ప్రముఖ కన్నడ స్టార్ హీరో దర్శన్ తుగదీప్పై పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్ ఒకరు చెప్పు విసిరేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఒక్కసారిగా కన్నడ పరిశ్రమలో కలకలం చెలరేగుతోంది. ఒక స్టార్ హీరోపై ఇలా చెప్పు విసిరేయడాన్ని పునీత్ సోదరుడు శివరాజ్‌కుమార్‌తో పాటు సుదీప్, రమ్య(దివ్య స్పందన), జగ్గేస్ తదితరులు తప్పుబడుతున్నారు. శివరాజ్ కుమార్ ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో.. ‘‘ నిన్న హోస్పెట్‌లో దర్శన్‌పై దాడి జరిగిందని తెలిసి నా మనసుకు బాధ కలిగింది. అది ఎవరు చేసినా.. తప్పు తప్పే. కళా రంగంలోని మేమంతా ఓ కుటుంబం అని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను.
ನೆನ್ನೆ ಹೊಸಪೇಟೆಯಲ್ಲಿ ದರ್ಶನ್ ಅವರ ಮೇಲೆ ನಡೆದ ಕೃತ್ಯ ನನ್ನ ಮನಸ್ಸಿಗೆ ನೋವುಂಟು ಮಾಡಿದೆ. ಈ ರೀತಿಯ ಅಮಾನವೀಯ ಘಟನೆ ಒಂದೇ ಮನೆಯವರಂತಿರುವ ಎಲ್ಲರಿಗೂ ನೋವುಂಟು ಮಾಡುತ್ತದೆ.
ಮನುಷ್ಯತ್ವ ಮರೆತು ಯಾರೂ ಈ ರೀತಿಯ ಕೃತ್ಯಗಳನ್ನು ನಡೆಸಬಾರದು ಎಂದು ವಿನಂತಿಸುತ್ತೇನೆ
ಅಭಿಮಾನದಿಂದ ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿ; ದ್ವೇಷ ಅಗೌರವವನ್ನಲ್ಲನಿಮ್ಮ
ಶಿವಣ್ಣ pic.twitter.com/34eJfpdmKk— DrShivaRajkumar (@NimmaShivanna) December 19, 2022
మా నాన్న కూడా ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. మేమంతా ఒక్కటే.. దయచేసి ఎవ్వరూ ఈ విధంగా చేయకండి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రముఖ కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా దీనిపై స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో ఓ సుధీర్ఘమైన పోస్టుపెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. ప్రతీ ఒక్కరిని గౌరవంగా చూసుకోవాలి. ఆ వీడియో చూడగానే నాకు బాధ వేసింది. అక్కడ చాలా మంది ప్రముఖులు స్టేజిపై ఉన్నారు. పబ్లిక్‌లో అలా చేయటం కన్నడిగులపై తప్పుడు అభిప్రాయాన్ని తెస్తుంది. పునీత్, దర్శన్ ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉన్న సంగతి నాకు తెలుసు.
Rebellion isn’t always an Answer.
❤️🙏🏼 pic.twitter.com/fbwANDdgP0— Kichcha Sudeepa (@KicchaSudeep) December 20, 2022
దీన్ని పునీత్ కూడా హర్షించడు. ఒకరు చేసే తప్పు పునీత్ ఫ్యాన్స్ చూపే ప్రేమ, అనురాగాలను పాడు చేయలేదు. దర్శన్ కన్నడ పరిశ్రమకు, భాషకు ఎంతో సేవ చేశారు. మా ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన నేను నా మనసులోని మాటను చెప్పకుండా ఉండలేను. విప్లవం ఎల్లప్పుడూ సమాధానం కాలేదు. నలుగురికీ ప్రేమను పంచండి. నేను ఎక్కువ మాట్లాడి ఉంటే క్షమించండి’’ అని అన్నారు. ప్రముఖ నటి రమ్య స్పందిస్తూ ‘‘ ఫ్యాన్స్ క్లబ్‌లు మంచి, మర్యాద పాటించాల’’ని అన్నారు. కన్నడ నటుడు జగ్గేష్ స్పందిస్తూ.. ‘‘ ఆర్టిస్టులను ఇలా అవమానించకండి. దర్శన్ పైకి అలా మాట్లాడతాడే కానీ, అతడి మనసు చిన్నపిల్లలలాంటిది’’ అని అన్నాడు. మరి, దర్శన్‌పై జరిగిన దాడిపై కన్నడ నటీ,నటులు స్పందిస్తున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.