తెర మీద అందంగా కనిపించే నటీనటుల్లో అనేక మంది జీవితాలు.. తెర వెనుక విషాద గాధలు. అవి వారు చెబితే కానీ తెలియదు. అటువంటి నటుల్లో ఒకరు బేబీ అంజు అలియాస్ అంజు ప్రభాకరన్. రీల్ లైఫ్‌లోనే కాదూ.. రియల్ లైఫ్‌లోనూ నటుడు కన్నడ ప్రభాకర్ తన పట్ల విలన్ గా వ్యవహరించారన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
సినిమా రంగుల ప్రపంచంలో నటీనటుల జీవితాలు అందంగా ఉంటాయనుకోవడం భ్రమ. నటీనటులు అవ్వడానికి ఎంతో కష్టపడతారు. తమను తాము నిరూపించుకునేందుకు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటారు.. అలాగే సినిమాల్లోకి వెళ్లాక వారి జీవితం పూల పాన్పు అవుతుందని భావిస్తుంటారు. సినీ రంగంలోకి వెళ్లాక కొన్నిసార్లు వయస్సు లేదా మనస్సు ప్రభావమో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయం భవిష్యత్తులో తీర్చలేని విషాదం.. పూడ్చలేని అగాధంగా మారిపోతుంది. అలా అనేక మంది నటీనటుల జీవితాలు నాశనమయ్యాయి. కొన్ని సార్లు గుణపాఠాలుగా మారతాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి.. నటిగా ఎంతో భవిష్యత్తు చూడాల్సిన ఆమె.. ఓ తప్పుడు నిర్ణయం తన జీవితాన్ని తల్లకిందులు చేస్తుందని ఊహించలేదు. ఆమె అంజు అలియాస్ అంజూ ప్రభాకర్. ఆమె మాజీ భర్త మరెవరో కాదూ.. తెలుగులో స్టార్ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ ప్రభాకర్. పెళ్లైన కొన్ని నెలలకే ఆయనతో విడిపోయారు. దానికి కారణాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
నటి అంజు అంటే ఎవరికీ గుర్తుండకపోవచ్చు కానీ.. శేషు మూవీలో రాజశేఖర్ వదినగా నటించి మెప్పించిన యాక్టర్స్ అంటే ఇట్టే గుర్తు పడతారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చిన ఆమె తర్వాత హీరోయిన్ కూడా అయ్యారు. తమిళ, మలయాళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటిగా నటించారు. తెలుగులో శోభన్ బాబు, చిరంజీవి, మోహన్ బాబు వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. అయితే 17 ఏళ్లలో తీసుకున్న ఓ నిర్ణయం ఆమె జీవితాన్ని టర్నింగ్ చేసింది. తన కంటే సుమారు 30 ఏళ్ల పెద్దవాడైన ఓ నటుడిని ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత విడిపోవడానికి కారణాలు, ప్రస్తుతం ఆమె ఏం చేస్తున్నారన్న విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘ఓ సినిమా 100 డేస్ ఫంక్షన్‌కు వెళ్లినప్ప్పుడు నన్ను చూసిన దర్శకుడు మహేంద్రన్ చైల్డ్ కావాలని చెప్పి ఉదిరిపూక్కల్ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. తల్లిదండ్రులకు నేను సినిమాలో నటించడం ఇష్టం లేకపోయినా నటించాను. మామ్మ ఇష్టంతో నటించాను. కెలిడీ కన్మణి (ఓ పాపలాలీ)లో మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత హీరోయిన్ గా చేయాలని, మంచి క్యారెక్టర్లు, చిన్నదైనా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేయాలని అనుకున్నాను. అందుకే గ్లామర్ పాత్రలో కూడా నటించాను‘ అని వ్యాఖ్యానించారు.
తన మ్యారేజ్ అనుకోకుండా జరిగిందన్నారు. ఓ కన్నడ సినిమా చేసేందుకు తాను బెంగళూరు వెళ్లినప్పుడు… కన్నడ ప్రభాకర్ అలియాస్ టైగర్ ప్రభాకర్.. తన సన్నిహితుల ద్వారా తనను పెళ్లి చేసుకుంటానని కబురు పంపారని అన్నారు. అప్పుడు తన వయస్సు 17 ఏళ్లని, తాను పెళ్లికి సిద్ధంగా లేనని, సినిమాలే చేయాలని భావించాలనుకున్నానన్నారు. అయితే పదే పదే అడగటంతో ఈ విషయం గురించి అమ్మ, నాన్నలకు చెప్పానన్నారు. అమ్మ బెంగళూరుకు వచ్చి కన్నడ ప్రభాకరన్ చూసి షాకయ్యారని, ఎందుకంటే.. అప్పటికే ఆయన వయస్సు తన నాన్న కంటే ఎక్కువని, సుమారు 50 ఏళ్లు ఉంటాయన్నారు. అయితే అమ్మ చెన్నై వెళ్లిపోతే.. తాను ఇంటికి వెళ్లి ఒప్పించేందుకు ప్రయత్నించానన్నారు. అయినా అమ్మ, నాన్నలు అంగీకరించలేదని, అయితే వారి పర్మిషన్ లేకుండానే అతడిని వివాహం చేసుకున్నానని అన్నారు. అయితే ఆరు నెలలు కాపురం చేశాక.. తాను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో తన పిల్లల్ని చూపించారని అన్నారు. అప్పటికే కన్నడ ప్రభాకర్‌కు రెండు పెళ్లిళ్లు జరిగాయని, తాను మూడవ దాన్ని అని తెలిసి మోసపోయనన్నారు. పెళ్లికి ముందు ఈ విషయం చెప్పకుండా..తనను నమ్మక ద్రోహం చేసి పెళ్లి చేసుకున్నారన్నారు. తనను చాలా నమ్మానని అలాగే.. వాళ్లు మాట్లాడారని తెలిపారు.
ఈ విషయం జీర్ణించుకోలేక.. ఆ వయస్సులో ఏమీ చేయలేక తిరిగి తల్లిదండ్రులకు వచ్చేశానన్నారు. తాను నిలదీసినందుకు కన్నడ ప్రభాకర్ తనను బ్యాడ్ చేశారని, ఆ సమయంలోనే తాను ఓ కఠిన నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఈ ఇంట్లో నుండి వెళ్లిపోయేటప్పుడు ఆయనతో ఒక మాట చెప్పానని, ‘తిరిగి ఈ ఇంటికి రాను. నేను చనిపోయినా, నువ్వు చనిపోయినా.. తిరిగి నీ ముఖం నేను చూడాలనుకోవడం లేదు‘ అని చెప్పేసి వచ్చానని, అందుకే ఆయన చనిపోయాక చివరి చూపుకు కూడా వెళ్లలేదన్నారు. ఆ సమయంలో చాలా బంగారాన్ని ఆయన దగ్గరే వదిలేసి వచ్చారనన్నారు. బాబు పుట్టాక డిప్రెషన్ లో కూడా ఉండిపోయానని, అమ్మ చెప్పాక, తిరిగి మళ్లీ పరిశ్రమలోకి అడుగు పెట్టానన్నారు. పలు సినిమాలు చేశానని, సీరియల్స్ చేశానన్నారు. కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని మళ్లీ నటిస్తున్నారన్నారు. కాగా, కన్నడ ప్రభాకర్ తెలుగు సినిమాలకు బాగా సుపరిచితులు. ఎక్కువగా చిరంజీవితో మంత్రిగారి వియ్యంకుడు, పసిపాడి ప్రాణం, రాక్షసుడు, కొదమ సింహం, జగదీక వీరుడు అతిలోక సుందరి వంటి సినిమాల్లో నటించారు.