గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అనారోగ్యంతో కొంతమంది, ప్రమాదాలు, ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు, దర్శక, నిర్మాతలు చనిపోవడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.. ప్రముఖ దర్శకులు కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ నటుడు, దర్శకుడు టపోరి సత్య.. కిడ్నీ ఫెయిల్యూర్ కావడంతో ఇటీవల ఆయనను ఓ ప్రేవేట్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స జరుగుతున్న సమయంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా టపోరి సత్య తల్లి మాట్లాడుతూ.. సత్య కిడ్నీ ఫెయిల్యూర్ కావడంతో హాస్పిటల్ కి తీసుకు వచ్చాం.. వారం రోజుల పాటు ఐసీయూలో ఉన్నాడు.. తన జీవితం సినిమాలకే అంకితం అనేవాడు. కుటుంబం కోసం ఎంతో కష్టపడేవాడు.. సత్య మరణం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.. అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
ఇండస్ట్రీలో సత్య కెరీర్ విషయానికి వస్తే.. యోగేష్, నందిత జంటగా నటించిన నంద లవ్ నందిత మూవీలో టపోరి సత్య విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత దర్శకుడిగా మారి మేళా చిత్రాన్ని తెరకెక్కించారు. మరో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. టపోరి సత్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన మరణంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. సత్య మరణంతో కన్నడ పరిశ్రమలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు.