సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. తన సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. మిగిలిన వివరాలు..
సినీ పరిశ్రమలో ఈమధ్య వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోని ఏదో ఒక చిత్ర పరిశ్రమ నుంచి విషాద వార్తలు వినాల్సి వస్తోంది. ఈ వార్తలు విని సినీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. తమ అసమాన ప్రతిభతో ఆకట్టుకున్న సినీ ప్రముఖులు మరణించడం వారిని కలచివేస్తోంది. ఇకపోతే, తాజాగా కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ శాండల్‌వుడ్ దర్శకుడు కిరణ్ గోవి కన్నుమూశారు. 53 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆయన మృతి చెందారు. ఈ రోజు తన ఆఫీసులో ఆయన గుండెపోటుకు గురయ్యారు.
సడెన్ హార్ట్ ఎటాక్‌కు గురైన కిరణ్ గోవీని ఆయన ఆఫీసులోని స్టాఫ్ వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘సంచారి’, ‘పయన’, ‘పారు వైఫ్ ఆఫ్ దేవదాస్’, ‘యారిగే యారింటు’ లాంటి పలు మూవీస్‌ను కిరణ్ గోవి తెరకెక్కించారు. పలు తెలుగు చిత్రాలకూ ఆయన దర్శకత్వం వహించారు. తెలుగులో ‘తిరుగుబోతు’ అనే ఫిల్మ్‌ను కిరణ్ డైరెక్ట్ చేశారు. ఆయన మరణంతో శాండల్‌వుడ్‌లో విషాదం నెలకొంది. కిరణ్ మృతిపై కన్నడ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
Kiran Govi Passed away: ಇಹಲೋಕ ತ್ಯಜಿಸಿದ ಪಯಣ, ಸಂಚಾರಿ ಸಿನ್ಮಾ ನಿರ್ದೇಶಕ ಕಿರಣ್ ಗೋವಿ! | #TV9B
Video Link►https://t.co/5Mxs0VM2ys#DirectorKiranGovie, #PayanaMovieDirector, #SanchariMovie
— TV9 Kannada (@tv9kannada) March 25, 2023