ఇటీవల పలు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది సినీ ప్రముఖులు అనారోగ్యంతో అయితే.. కొంతమంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.
గత కొంత కాలంగా ఇండస్ట్రీని విషాదాలు వరుసగా వెంటాడుతున్నాయి. పలు ఇండస్ట్రీలో సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. వీరిలో కొంతమంది సహజ మరణాలు అయితే.. మరికొంత మంది బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. తాజాగా కన్నడ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ దర్శకులు సీవీ శివశంకర్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ దర్శకులు సీవీ శివశంకర్ కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. కన్నడలో రచయితగా ఎన్నో చిత్రాలకు సినీ గీతాలు అందించారు. జూన్ 27న ఆయనకు గుండెపోటు రావడంతో బెంగుళూరులో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ విషయాన్ని తనయుడు వెంకట్ భరద్వాజ్ తెలియజేశారు. 1962 లో కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ఆరంభించారు సీవీ శివశంకర్. మంజరి మూవీలో నటుడిగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. 1967 లో పదవీధార అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. 1968 లో ‘నమ్మ ఊరు’ అనే మరో సినిమాకు దర్శకత్వం వహించారు. ఇదే ఆయన చివరి చిత్రం.
కొంతకాలం తర్వాత దర్శకత్వానికి స్వస్తిపలికి రచయితగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిచారు. కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి సాహిత్యం అందించారు. ఆనందదా తవరూరు, బెంగుళూరు నగారా, సిరివంతనాదరూ కన్నడ నాదల్లె మెరెవే చిత్రాలకు ఆయన పాటలు రాశారు. ఆయనకు భార్య రాధమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకట్ భరద్వాజ్ ప్రస్తుతం సినీ రంగంలో కొనసాగుతున్నారు. శిశంకర్ ను కన్నడ ప్రభుత్వం ‘కర్ణాటక రాజ్యోత్సవ’ అవార్డుతో సత్కరించారు. ఆయన మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులు, అభిమానుల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.