చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలు తమ ఫిజిక్ ను కాపాడుకోవడం కోసం రకరకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. మరి కొందరు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. అలా చేసే క్రమంలో అక్కడ కొన్ని కొన్ని సరదా సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. వాటిని తారలు సోషల్ మీడియాలో తమ అభిమానులతో పంచుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా డాన్స్ చేస్తూ కింద పడ్డ హీరోయిన్ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
రాధిక కుమారస్వామి.. కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కానీ గత కొద్ది కాలంగా మూవీలకు దూరంగా ఉంటున్న ఈమె 2010 నవంబర్ లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామిని రెండవ వివాహం చేసుకుంది. దాంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. సినిమాలు చేయక పోయినా సోషల్ మీడియాలో మాత్రం రాధిక యమ యాక్టివ్. తరచు తన ఫొటోలను షేర్ చేస్తూ, అభిమానులతో చిట్ చాట్ లు చేస్తారు. అయితే తాజాగా రాధిక తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో తన జిమ్ ట్రైనర్తో కలిసి జిమ్లో ఎంతో ఎనర్జీతో రాధిక డ్యాన్స్ చేస్తోంది. మాస్ స్టెప్పులతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఆమె.. బ్యాలెన్స్ కోల్పోయి కిందపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో రాధిక డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఇంతకు ముందు బీచ్ లో బాద్షా పాట జుగ్నుకు స్టెప్పులేసి అదుర్స్ అనిపించుకుంది. ఈక్రమంలోనే .. ”మేడం పడ్డవారు ఎప్పుడు చడ్డవారు కాదు.” అంటూ కొందరు నెటిజన్స్ సరదాగా స్పందించారు. మరి రాధిక కుమారస్వామి మాస్ డ్యాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సమంతతో కలిసి నటించడంపై మొదటిసారి స్పందించిన నాగచైతన్య!
ఇదీ చదవండి: Salman Khan: ప్రాణాలు పోతాయని భయపడుతున్న సల్మాన్ ఖాన్!