Kanishka Soni: నెల రోజుల క్రితం 24 ఏళ్ల ఓ అమ్మాయి తనను తాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌కు చెందిన క్షమా బిందు తనను తాను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. అప్పుడంతా ఇదేం విడ్డూరం అనుకున్నారు. తాజాగా, ఓ ప్రముఖ నటి కూడా తనను తాను పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ నటి, ‘ఈ తరం ఇల్లాలు’ సీరియల్ ఫేమ్ కన్షికా సోనీ తనను తాను పెళ్లి చేసుకున్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు. ‘‘ నన్ను నేను పెళ్లి చేసుకున్నా. నేను నా కలలను నా సొంతంగా నెరవేర్చుకున్నా. నేను నాతోనే ప్రేమలో ఉన్నా. ఇకపై నాకు ఏ మగాడి అవసరం లేదు. నేను ఒంటరిగానే సంతోషంగా ఉంటా. అంతా నేనే.. అన్నీ నాలోనే ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం కన్షికా పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లనుంచి ట్రోలింగ్ మొదలైంది.
దీంతో ఆమె స్పందించారు. ‘భయంకరమైన కామెంట్లు’ అని పేర్కొన్నారు. తనకు భారత సాంప్రదాయాలపై నిజంగా నమ్మకం ఉందని అన్నారు. తనను ట్రోల్ చేయటం ఆపాలని కోరారు. కాగా, కన్షికా ‘బాత్ రూమ్ సింగర్’ అనే టీవీ రియాలిటీ షోతో బుల్లితెరపై అడుగుపెట్టారు. హిందీ సీరియల్ ‘దియా ఔర్ బాతీ హమ్’ తో నటిగా మారారు. ఈ సీరియల్ తెలుగులో ‘ ఈతరం ఇల్లాలు’గా డబ్ అయింది. 2012లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘దేవరాయ’ సినిమాలో ఐటమ్‌సాంగ్ చేశారు. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలు, సీరియళ్లతో బిజీబిజీ గడుపుతున్నారు. మరి, కన్షికా తనను తాను పెళ్లి చేసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి: Charmi Kaur: 13 ఏళ్లకే హీరోయిన్! 25 ఏళ్ళకి కెరీర్ ఔట్! అయినా.. మగాడిలా నిలబడింది!