కంగనా రనౌత్.. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా తనకంటూ ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది. ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తుంది అన్న పేరు కంగనాకు ఉండనే ఉంది. తాజాగా మరోసారి తన బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది.
ఇండస్ట్రీలో ఏ విషయం గురించైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే హీరోయిన్స్ లల్లో బాలీవుడ్ బ్యూటీ, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఒకరు. ఎప్పుడు ఏదో ఒక విషయంలో తన అభిప్రాయాలను బోల్డ్ గా ఎక్స్ ప్రెస్ చేయడంలో ఈ అమ్మడు దిట్ట. ఇక కాంట్రవర్సీలు క్రియేట్ చేసినా వాటిని అంతే ధైర్యంగా ఎదుర్కొగలదు కంగనా. ఇక కొన్ని రోజులుగా బాలీవుడ్ తో పాటుగా దేశంలో జరిగే వివిధ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి తన మాటల తూటాలు వదిలింది. 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది.
కంగనా రనౌత్.. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా తనకంటూ ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది. ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తుంది అన్న పేరు కంగనాకు ఉండనే ఉంది. తాజాగా మరోసారి తన బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది. తన సోషల్ మీడియా పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది.”1997 నుంచి 2012 మధ్య పుట్టిన జనరేషన్ అంతా ఫోన్లకు బానిసలు అయ్యారు. డబ్బులు లేవని కమిట్ మెంట్ తో పాటుగా పెళ్లి చేసుకోవడానికి కూడా వీరు భయపడుతున్నారు. ఇక వీరు శృంగార విషయంలో బద్దకాన్ని చూపెడుతున్నారు. వారిని క్యారెట్, ముల్లంగితో పోల్చుతున్నాను” అంటూ రాసుకొచ్చింది.
ఇక ఈ జనరేషన్ లో పుట్టిన వారి మనసులు స్థిరంగా ఉండవని, వారికి క్రమ శిక్షణతో ఎదిగిన వారంటే ఇష్టముండదు అని ఈ సందర్బంగా పేర్కొంది. ఇలాంటి వారు షార్ట్స్ కట్స్ తో విజయం సాధించిన వారినే హీరోలుగా చూస్తారని చెప్పుకొచ్చింది కంగనా. ఇక ప్రస్తుతం కంగనా చంద్రముఖి2 చిత్రంతో పాటుగా మరికొన్ని చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ప్రజెంట్ చేసిన దాదాఫాల్కే అవార్డులపై కూడా కంగనా విమర్శలు గుప్పించిన విషయం మనకు తెలిసిందే. మరి కంగనా ఈ జనరేషన్ పై చేసిన బోల్డ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.