కంగనా రనౌత్.. ఆమె ఏది చేసినా సంచలనమే. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతూ సోషల్ మీడియాలో సమకాలీన అంశాలపై స్పందిస్తు తరుచు వార్తల్లో ఉంటుంది. అయితే తాజాగా ఈ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ తన పెళ్లివార్తలపై ఫన్నీగా స్పందించింది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇక విషయం ఏంటంటే? కంగనా రనౌత్ ధాకడ్ అనే మూవీలో నటించింది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఆమె ప్రమోషన్ లో పాల్గొంది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఇది కూడా చదవండి: RGV : మహేష్ మాటలకు అర్థమే లేదు.. అలా అనటం తప్పు! : RGV
మీరు నిజజీవితంలో కూడా టామ్ బాయ్ మాదిరే ఉంటారా అని ప్రశ్నించగా.. ‘నిజజీవితంలో నేను ఎవరిని కొట్టాను చూపించండి.. మీరు ఇలాంటి పుకార్లు సృష్టించడం వల్లే నాకింకా పెళ్లి కావడం లేదు. నేను ఊరికే అందరితో గొడవ పడతానేమో అని జనాలు అనుకుంటున్నారు’ అని కంగనా నవ్వుతూ చెప్పింది. తాజాగా చేసిన ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారతున్నాయి. కంగనా చేసిన ఈ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.