బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. థియేటర్ లో విడుదలైన RRR మూవీ వరల్డ్ వైడ్ గా దూసుకుపోతూ కలెక్షన్ ల పరంగా కూడా సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. అయితే ఈ సినిమాపై కొందరు బాలీవుడ్ క్రిటిక్స్ మాత్రం నెగిటివ్ రివ్యూలు ఇస్తూ విమర్శలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మాత్రం సినిమాపై, రాజమౌళిపై ప్రశంసలు కురిపించింది.
ఇది కూడ చదవండి: RRRపై కేఏ పాల్ సెటైర్స్. .నీ మొహం రా అంటూ వర్మ కౌంటర్!
రాజమౌళి ఒక విజయవంతమైన దర్శకుడు మాత్రమే కాదు. దేశంపై అలాగే ధర్మంపై ఆయన చూపించే ప్రేమ గొప్పది అని అన్నారు. ఇక మంచి మానవత్వం గుణాలు ఉన్న ఒక గొప్ప మనిషి అని కూడా కంగనా వివరణ ఇచ్చారు. భారతీయ దర్శకుల్లో రాజమౌళి సార్ గ్రేట్ అని ఓటమి ఎరుగని దర్శకుడు అంటూ పొగిడింది ఈ ముద్దుగుమ్మ. త్వరలోనే RRR మూవీని చూసేందుకు కుటుంబంతో పాటు కలిసి వెళ్తున్నానని తెలిపింది కంగనా. RRR మూవీపై, రాజమౌళిపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.