బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సహాయ నటిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ.. టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. రెండు సార్లు నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఇక బాలీవుడ్‌లోని బంధుప్రీతితో సహా.. దేశంలో చోటు చేసుకునే వర్తమాన అంశాలపై తనదైన శైలీలో స్పందిస్తూ.. నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో కథా ప్రధాన్యమున్న చిత్రాలు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచింది కంగనా. తాజాగా ధాకడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కంగనా. ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కంగన కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ప్లాఫ్‌లను ఏమాత్రం పట్టించుకోకుండా.. వరుస చిత్రాలు చేస్తూ ముందుకు వెళ్తుంది కంగన. తాజాగా మరో చిత్రం షూటింగ్ ప్రారంభించింది.
ఇండియాలోనే కాక.. దేశవ్యాప్తంగా మోస్ట్ పవర్ ఫుల్ లీడర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న నాయకురాలు, మాజీ దివంగత ప్రధాని.. ఇందిరా గాంధీ. మోస్ట్ పవర్ ఫుల్ లేడీగా గుర్తింపు పొందిన ఇందిర రాజకీయ జీవితంలో ఎమర్జెన్సీ విధింపు అనేది ఓ మయని మచ్చగా నిలిచింది. ఆ కథాంశంతో.. తెర మీదకు ఇందిరా గాంధీగా వచ్చేస్తోంది కంగనా. ఎమర్జెన్సీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ గురువారం ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించనుంది. అయితే ఈ సినిమా ఇందిరా గాంధీ బయోపిక్ కాదట. ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకుని చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
షూటింగ్ ప్రాంరభం సంద్భంగా చిత్ర బృందం ఎమర్జెన్సీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్‌ని కూడా విడుదల చేసింది. ఇది చూసిన వారంతా.. ఇందిరా గాంధీ లుక్‌లో కంగనా అద్భుతంగా సెట్ అయ్యింది. ఆమె ఆహార్యాన్ని అచ్చుగుద్దినట్లు దించేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ప్రపంచంలోని అత్యంత శక్తివంతురాలు.. వివాదాస్పాదురాలైన ఓ మహిళ పాత్రను పోషిస్తున్నాను’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ టీచర్, ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఈ సినిమాకు కంగనాయే దర్శకత్వం వహిస్తుంది. పైగా తనకంటే బాగా ఈ చిత్రాన్ని ఎవరు తీయలేరని చెప్తుంది. మరి ఈ పోస్టర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.