కంగనా రనౌత్.. బాలీవుడ్ బ్యూటీ క్వీన్ మాత్రమే కాదు, కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ కూడా అని అందరికీ తెలిసిందే. ఆమె చేసే వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేయడమే కాదు.. బీ టౌన్ లో ఎంతో మందిని ఇరాకటంలోనూ పడేస్తుంటాయి. బాలీవుడ్ లో ఓ రెబల్ యాక్ట్రస్ గా ఎదిగి.. ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన విషయం తెలిసిందే. ఓ వర్గం వారిని టార్గెట్ చేస్తూ కంగనా ఎప్పుడూ కౌంటర్లు వేస్తుంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కొన్ని కుటుంబాల కనుసన్నల్లో నడుస్తోందనేది ఆమె వాదన. ఆ విషయాలను చాలాసార్లు బాహాటంగానే వెల్లడించింది.
ఆమె లీడ్ రోల్ లో తాజాగా తెరకెక్కించిన ధాకడ్ చిత్రం మే 20న విడుదలైంది. సినిమాకి పూర్తి నెగెటివ్ టాక్ రావడంతో.. రన్ అవడానికి అష్టకష్టాలు పడుతోంది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. హాలీవుడ్ రేంజ్ ఎలివేషన్స్ చూసి కంగానా బిగ్గెస్ట్ యాక్షన్ హీరోయిన్ కాబోతోందంటూ కామెంట్ చేశారు. కానీ, సినిమా విడుదల తర్వాత అంతా తారుమారు అయ్యింది. సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
She can gather n of stars for review, But she can’t gather the 100 Crs invested in it.#dhakad pic.twitter.com/K0tKFq6XOn
— Брат (@B5001001101) May 29, 2022
అంతేకాకుండా సినిమా సెకెండ్ వీక్ ఫస్ట్(మే 27, శుక్రవారం) డేలో కలెక్షన్స్ అతి దారుణంగా నమోదు అయ్యాయి. ఆ సినిమాకి ఎనిమిదో రోజు 20 టికెట్లు అమ్ముడుకాగా, వాటి ద్వారా రూ.4,420 కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాని మొత్తం రూ.90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. రూ.5 కోట్లలోపు షేర్ మాత్రమే రాబట్టగలిగింది. అంటే ఈ సినిమాకి దాదాపు రూ.85 కోట్ల మేర నష్టాలు వచ్చాయనమాట. అంటే ఈ సినిమా ది బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాగా రికార్డుల కెక్కిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
#Dhakad movie collection for 8th day is 4420 Rupees, I’m thinking to buy the full rights of the movie in 5000 Rupees. I believe it’s a good deal for the makers, what say ?🤐#KangnaRanaut #dhakad
— Mrinal Dwivedi (@MrinalDwivedi7) May 28, 2022
ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ పై ట్రోలింగ్ కూడా పెద్దఎత్తునే జరుగుతోంది.బయట ప్రగల్బాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కాదు.. ముందు సినిమాలపై దృష్టి పెట్టు అంటూ సోషల్ మీడాయలో కామెంట్ చేస్తున్నారు. కంగనా రనౌత్ అటు సినిమానే కాకుండా సామాజిక అంశాలపై కూడా తనదైనశైలిలో స్పందిస్తుంటుందని అందరికీ తెలిసిందే. కంగనా సినిమా డిజాస్టర్ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Dhakad madam’s movie is super duper flop and only 20 tickets were sold on 1st day 1st show, nevermind she would be offered a National award for being favourite?
— QueenBee (@VaidehiTaman) May 28, 2022
#Dhakad opening : 35 lakhs
Fun fact : Government of India spends more on her Y+ security daily than Dhakad’s box office collection.
— Roshan Rai (@RoshanKrRaii) May 22, 2022
#KanganaRanaut is now officially “THE QUEEN OF FLOP MOVIES”#Dhakad
Source: https://t.co/AiQGP9FoCw pic.twitter.com/EzMSTJnAf8
— indianposten (@indianposten) May 24, 2022