‘ఇండియన్ 2 ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యేలా ఉండటంతో దర్శకుడు శంకర్ మరో రెండు ప్రాజెక్టులు చేపట్టేందుకు పచ్చజెండా ఊపారు. ఇది లైకా నిర్మాణ సంస్థకు ఆగ్రహం తెప్పించింది. కమల్ హాసన్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ ‘ఇండియన్ 2’. లైకా నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టి ఇప్పటికే రూ.200 కోట్ల మేరకు ఖర్చు చేసింది. అయితే, ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి అన్ని అవాంతరాలే ఎదురవుతున్నాయి. తమ సినిమా షూటింగ్ పూర్తి చేయకుండా మరో ప్రాజెక్టు చేపట్టకుండా ఆదేశాలు జారీచేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకుని సముచిత నిర్ణయం తీసుకోవాలంటూ సూచన చేసింది. కోర్టు సూచన మేరకు ఇరు వర్గాలు చర్చలు జరుపగా, ఈ చర్చలు విఫలమయ్యాయి. ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారం ఇపుడు కోర్టులో ఉంది. ఈ అంశంలో హీరో కమల్ హాసన్ ఇప్పటివరకు ఎక్కడా జోక్యం చేసుకోలేదు. ఆయన గత రెండు మూడు నెలలుగా అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నం కావడమే. ఇపుడు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయింది. కమల్ ఈ పంచాయితీలో జోక్యం చేసుకుంటారా? లేదా? అన్నది తేలాల్సి వుంది. సినిమాలు వదిలి రాజకీయాల్లోకి రావడం వల్ల తాను రూ.300 కోట్ల మేరకు నష్టపోయినట్టు కమల్ గతంలో వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇపుడు ‘ఇండియన్-2’ ప్రాజెక్టు కోసం లైకా నిర్మాణ సంస్థ ఇప్పటివరకు రూ.200 కోట్ల మేరకు ఖర్చు చేసింది. మరి ఈ సంస్థ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కమల్‌హాసన్ ‘ఇండియన్-2’ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారన్న టాక్ కోలీవుడ్‌లోని ఓ వర్గం నుంచి వినిపిస్తోంది. అదే జరిగితే మంచిదే కదా