విక్రమ్.. కమల్ హాసన్ కెరీర్‌లో గుర్తిండిపోయే, బాగా చెప్పుకోదగ్గ సినిమాల్లో ఇదీ ఒకటి. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి.. ఇప్పటికీ థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. విక్రమ్ సినిమా కేవలం 25 రోజుల్లోనే 400 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ సూపర్ హిట్స్ లిస్ట్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఈ సినిమా జులై 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా ఇంతటి భారీ హిట్ కావడానికి ఇద్దరు ప్రధాన కారణం.. ఒకటి లోకేష్ కనకరాజ్, రెండోది కమల్ హాసన్. 67 ఏళ్ల వయసులోనూ ఈ సినిమా కోసం కమల్ హాసన్ ఎంత కష్టపడ్డాడో స్వయంగా డైరెక్టరే వెల్లడించాడు.
కమల్ పడిన కష్టాన్ని మాటల్లో చెప్పడమే కాకుండా డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ ఒక వీడియో విడుదల చేశాడు. విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో బాబుని కాపాడే క్రమంలో కమల్ హాసన్ ఓ పెద్ద పాత మెషిన్ గన్ ను ఆపరేట్ చేస్తుంటాడు. ఆ మొత్తం షాట్ ఒక 5 నిమిషాలు ఉంటుంది. ఆ షాట్ లో బైసిప్స్ బాగా హైలెట్ అవుతాయి. ఆ షాట్ గురించి కమల్ కి చెప్పినప్పుడు.. షాట్ డ్యూరేషన్ గురించి అడగ్గా 5 నిమిషాలు అని చెప్పారు. వెంటనే కమల్ హాసన్ వెళ్లి బైసిప్స్ హైలెట్ అయ్యేందుకు 26 పుషప్స్ చేశారని డైరెక్టర్ తెలియజేశాడు.
ఆ వీడియో ట్వీట్ చేస్తూ లోకేశ్ కనకరాజ్.. ‘మాటిచ్చిన విధంగానే సార్ వర్కౌట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నిజానికి ఆయన 26 పుషప్స్ తీశారు. నేను మొదటి రెండు రికార్డ్ చేయడం మిస్ అయ్యాను.. ది ఈగల్ హ్యాస్ లాండెడ్’ అంటూ డైరెక్టర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం కమల్ హాసన్ వర్కౌట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వయసులోనూ సినిమా కోసం కమల్ చేస్తున్న కష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
@ikamalhaasan sir’s video as promised.. He did 26..i missed recording the initial two..
The eagle has landed🔥#Vikram pic.twitter.com/5rdKG9JPoE— Lokesh Kanagaraj (@Dir_Lokesh) June 28, 2022