విశ్వనటుడు కమల్ హాసన్ కు కరోనా సోకింది. ప్రస్తుతం కమల్ హాసన్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు. కమల్ హాసన్ ఇంటికి అధికారులు పోస్టర్ అంటించారు. ఇటీవలే విదేశాల నుంచి కమల్ హాసన్ తిరిగి వచ్చాడు. ఆ తరువాత ఒంట్లో నలతగా ఉండటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. తనను కలిసిన అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
அமெரிக்கப் பயணம் முடிந்து திரும்பிய பின் லேசான இருமல் இருந்தது. பரிசோதனை செய்ததில் கோவிட் தொற்று உறுதியானது. மருத்துவமனையில் தனிமைப்படுத்திக் கொண்டுள்ளேன். இன்னமும் நோய்ப்பரவல் நீங்கவில்லையென்பதை உணர்ந்து அனைவரும் பாதுகாப்பாக இருங்கள்.
— Kamal Haasan (@ikamalhaasan) November 22, 2021
సినిమాల విషయానికి వస్తే కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం ‘విక్రమ్’. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఆఖరి షెడ్యూల్ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. విక్రమ్ చిత్రంలో కమల్ వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమౌతుంది. ఈ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ తెరకెక్కించనున్నారు. ఇందులో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ‘విక్రమ్’ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆఖరి షెడ్యూల్ నడుస్తున్న నేపథ్యంలో.. ఈ సినిమా షూటింగ్ పై కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి ప్రభావం చూపుతుందేమో చూడాలి.
Advance Happy Birthday Ulaganayagan @ikamalhaasan sir🙂
The First Glance into the world of VIKRAM awaits you all tomorrow at 6pm🔥#HBDUlaganayagan#Vikram_April2022 pic.twitter.com/jKSsjKaH0o— Lokesh Kanagaraj (@Dir_Lokesh) November 5, 2021