Vikram: విశ్వనటుడు కమల్ హాసన్ ఇటీవలే ‘విక్రమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత కమల్ కి మామూలు కాదు.. ఏకంగా ‘ఆల్ టైమ్ కెరీర్ హిట్’గా నిలిచింది విక్రమ్. కమల్ వీరాభిమాని, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ రాబడి అద్భుతమైన కలెక్షన్స్ తో రికార్డుల మోత మోగిస్తోంది.
ప్రస్తుతం విక్రమ్ ఇచ్చిన బిగ్గెస్ట్ హిట్ ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు కమల్. ఇప్పటికే చిత్ర యూనిట్ కి భారీ బహుమతులు, పార్టీలు ఇచ్చాడు. తాజాగా మరోసారి విక్రమ్ టీమ్ అందరితో కలిసి స్పెషల్ పార్టీ చేశారు. అయితే.. ఈసారి సినిమాకి పని చేసిన డైరెక్షన్ టీమ్వా, ప్రొడక్షన్, లైటింగ్, స్టంట్స్, మేకప్.. ఇలా అందరిని పిలిచి సక్సెస్ మీట్ నిర్వహించి గ్రాండ్ గా మాంచి విందు భోజనం పెట్టించాడు కమల్.
చెన్నైలో నిర్వహించిన ఈ పార్టీకి కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్, అనిరుధ్ రవిచందర్, విజయ్ సేతుపతి, ఉదయనిధి స్టాలిన్, పలువురు తమిళ ప్రముఖులు, సినిమా యూనిట్ అంతా పాల్గొన్నారు. ఇక ఈ సక్సెస్ డిన్నర్ పార్టీకి సంబంధించి స్పెషల్ మెనూ కూడా వైరల్ అవుతోంది. వెజ్, నాన్ వెజ్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, మటన్ కీమా బాల్స్, వంజరం తవా ఫిష్ ఫ్రై, నాటు కోడి సూప్, ప్రాన్ పచ్చడి, మైసూర్ మసాల దోశ, పన్నీర్ టిక్కా, బిర్యానీ.. ఇలా అన్ని వెరైటీలు ఉన్నాయి.
ఇక ఈ విందులో కమల్, లోకేష్, అనిరుధ్, ఉదయనిధి స్టాలిన్ అందరూ కూర్చొని అందరితో కలిసి భోజనం చేసిన పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. భోజనాలు అయ్యాక ఫోటో సెషన్ నిర్వహించారు. అనంతరం సక్సెస్ మీట్ లో విజయ్ సేతుపతి, లోకేష్, ఉదయనిధి స్టాలిన్, అనిరుధ్ లను కమల్ ఆప్యాయంగా ముద్దాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విక్రమ్ పార్టీ ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. మరి విక్రమ్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Vikram team @ikamalhaasan @Dir_Lokesh @anirudhofficial @Udhaystalin sat with distributors, exhibitors and media for an excellent non-vegetarian #ChettinadSappad #Vikramsuccessmeet pic.twitter.com/eff50gMUQZ
— Sreedhar Pillai (@sri50) June 17, 2022
#Loki style balamana virundhu for theatre owners / distributors / press media for #VikramRoaringSuccess !!! Whattah feast was that 😍😋
Thank You @RKFI & @RedGiantMovies_ #VikramSuccessMeet pic.twitter.com/EQT9HqW0OM
— Rakesh Gowthaman (@VettriTheatres) June 17, 2022
Dinner 🥘 is on 😍#VikramSuccessMeet ✨@Udhaystalin @ikamalhaasan @Dir_Lokesh @RKFI pic.twitter.com/TclFkI7Ri5
— Vinodth Vj… (@Vinodth_Vj) June 18, 2022
#VikramSuccessMeet – Menu of #Sappad served! pic.twitter.com/pUfrp32WnD
— Sreedhar Pillai (@sri50) June 17, 2022