Kamal Haasan: ‘‘విక్రమ్’’ సినిమా సక్సెస్‌తో కమల్ హాసన్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. సినిమా కలెక్షన్ల పరంగా సాధించిన విజయంతో ఆర్థికంగా కూడా ఆయన కోలుకున్నారు. గతంలో చేసిన అప్పుల్ని మొత్తం కట్టేస్తానని ఆయనే స్వయంగా చెప్పారు. ఇక, అదే సంతోషంతో తన సొంత పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. సోమవారం పార్టీ తరపున ఓ రక్త దాన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ కార్యక్రమంలో కమల్‌తో పాటు కొందరు పార్టీ కీలక నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ నేత పార్టీ చేస్తున్న ఈ రక్త దాన కార్యక్రమం గురించి స్టేజి మీద మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఓ అభిమాని విక్రమ్, విక్రమ్ అని అరవటం మొదలుపెట్టారు. దీంతో కమల్ హాసన్ సీరియస్ అయ్యారు.
ఆ అభిమాని వైపు కోపంగా వేలు చూపిస్తూ.. నిశ్శబ్ధంగా ఉండమని హెచ్చరించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ తాను ఎందుకు కోప్పడాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. కమల్ మాట్లాడుతూ.. ‘‘ ఈ రక్త దాన కార్యక్రమం ద్వారా 4 లక్షల లీటర్ల రక్తాన్ని ప్రజలకు ఉచితంగా అందించాలి. ఇదే 4 లక్షల లీటర్లు వేరే వ్యాపారుల చేతిలోకి వెళితే అమ్ముకుని కోట్లు సంపాదించేవారు. అలా కాకూడదని ఈ రక్త దాన కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఇదే విషయాన్ని ఓ నేత మాట్లాడుతున్నపుడు వెనకాల నుంచి ఎవరో విక్రమ్, విక్రమ్ అని అరుస్తుంటే.. రక్తాన్ని మనమే అమ్ముతున్నామని జనం అనుకుంటారు.(విక్రం అంటే తమిళంలో అమ్మటం అని అర్థం వస్తుంది. రక్తం గురించి మాట్లాడుతున్నపుడు ‘విక్రం’ అని అరవటం వల్ల రక్తాన్ని అమ్ముతున్నారనే అర్థం వస్తుందని కమల్ ఉద్ధేశ్యం).
అందుకే విక్రమ్ అన్న మాటని ఇక్కడ ఎత్తకండి’’ అంటూ అందర్నీ నవ్వించారు. కాగా, విక్రమ్ సినిమా ఇప్పటి వరకు 310 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. దీనిపై కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘‘డబ్బుల గురించి చింతించని నాయకుడు తోడు ఉంటే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందుతారు. నేను 300 కోట్ల రూపాయలు సంపాదించగలను అని చెప్పినప్పుడు ఎవరికి అర్థం కాలేదు. పైగా నేను డబ్బా కొడుతున్నాను అనుకున్నారు. కానీ ఇప్పుడు మీరే స్వయంగా మీ కళ్లతో చూస్తున్నారు.. నేను చెప్పిన మొత్తం వచ్చింది(విక్రమ్ బాక్సాఫిస్ కలెక్షన్లను ఉద్దేశిస్తూ)’’ అన్నారు. మరి, కమల్ హాసన్ నిర్వహిస్తున్న రక్త కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయ గలరు.
#Video | விக்ரம் Modeல் கமல்ஹாசன்!#Sunnews | #Vikram | @ikamalhaasan pic.twitter.com/F5lOesCZX3
— Sun News (@sunnewstamil) June 13, 2022
ఇవి కూడా చదవండి : Prabhas: స్లిమ్ గా మారిన ప్రభాస్.. ట్రెండ్ అవుతున్న కొత్త కటౌట్