ఆమె స్టార్ హీరోయిన్. స్టార్ డైరెక్టర్ కూతురు. చేసింది కొన్ని సినిమాలే అయినా సౌత్ లో బాగానే క్రేజ్ తెచ్చుకుంది. మరి ఆమె ఎవరనేది గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
సాధారణంగా హీరోయిన్లు అనగానే జీరో సైజ్ బాడీ మెంటైన్ చేస్తూ ఉంటారు. గ్లామర్ తో అదరగొడుతూ ఉంటారు. దాదాపుగా ఏ ఇండస్ట్రీ తీసుకున్నాసరే ఇదే కనిపిస్తూ ఉంటుంది. స్క్రీన్ పై అందంగా కనిపించడం కోసం చాలా కష్టాలు పడుతుంటారు. మూవీస్ చేస్తున్నన్నీ రోజులు ఈ తరహా ఫిజిక్ ని మెంటైన్ చేయాల్సి ఉంటుంది. అయితే సినిమాల్లోకి రాకముందు మాత్రం కొందరు హీరోయిన్ల ఫొటోలు చూస్తే మీరు అస్సలు గుర్తుపట్టలేరు. తాజాగా ఓ హీరోయిన్ ఫొటో అలానే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఇప్పటికీ, అప్పటికీ ఇంతలా ఎలా మారిపోయిందా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఆ బ్యూటీ ఎవరో కనిపెట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు కల్యాణి ప్రియదర్శన్. ఏమైనా గుర్తొస్తే ఓకే. లేదంటే మాత్రం అలా స్టోరీ చదువుతూ వెళ్లండి. మీకు ఆమె ఎవరనేది తెలిసిపోతుంది. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్-నటి లిసీల కూతురే ఈమె. చిన్నప్పుడే పెద్దగా యాక్టింగ్ అంటే ఈమెకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ టీనేజ్ లోకి వచ్చిన తర్వాత చుట్టూ సినిమా వాతావరణం ఉండేసరికి మెల్లగా ఎట్రాక్ట్ అయింది. అలా అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘హలో’ మూవీతో హీరోయిన్ గా మారింది. రిజల్ట్ సంగతి పక్కనబెడితే.. బ్యూటీ విషయంలో సూపర్ మార్క్స్ కొట్టేసింది.
‘హలో’ తర్వాత ‘చిత్రలహరి’, ‘రణరంగం’ సినిమాలు చేసిన కల్యాణి.. అనంతరం పూర్తిగా తమిళ, మలయాళ ఇండస్ట్రీలకే పరిమితమైపోయింది. గత రెండేళ్ల నుంచైతే పూర్తిగా మలయాళంలోనే మూవీస్ చేస్తూ వచ్చింది. ఇక సౌత్ లో బాగా ఫేమస్ అయిన ఈమె.. సినిమాల్లోకి రాకముందు చాలాబొద్దుగా కళ్లద్దాలు పెట్టుకుని ఉండేది. ఆ తర్వాత స్లిమ్ లుక్ లోకి మారిపోయి అందరినీ షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం ఆ రెండు ఫొటోల్ని పక్కపక్కన పెట్టి కంపేర్ చేస్తున్న నెటిజన్స్.. అసలు ఈ రేంజ్ మార్పు ఎక్కడా చూడలేదని మాట్లాడుకుంటున్నారు. మరి పైన ఫొటో చూడగానే మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.