పైన ఫొటోలని ఇద్దరమ్మాయిలు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్. ఇప్పటికీ దాన్ని అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. స్టార్ హీరోయిన్లుగా వరస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. మరి వాళ్లెవరో గుర్తుపట్టారా?
వారిద్దరూ చిన్నప్పటి ఫ్రెండ్స్. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం హీరోయిన్ గా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకరు టాప్ హీరోయిన్ కాగా, మరొకరు కూడా యంగ్ హీరోలతో నటిస్తూ హిట్స్ కొడుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ ఇద్దరూ ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మాత్రం అందులో కాస్త మినహాయింపు ఇచ్చి గ్లామర్ చూపిస్తున్నారు. ఒకరేమో స్టార్ హీరోలతో జోడీ కడుతూ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయారు. మరో బ్యూటీ సొంతభాషలో హిట్స్ కొడుతూ దుసుకుపోతోంది. మరి ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరనేది కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరిలో నిల్చున్న పాప కీర్తి సురేష్, కూర్చున్న అమ్మాయి కల్యాణి ప్రియదర్శన్. కేరళలో పుట్టి పెరిగిన ఈ ఇద్దరూ తెలుగు సినిమాలతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ‘నేను శైలజ’ కీర్తి హిట్ కొట్టగా.. అఖిల్ ‘హలో’తో కల్యాణి టాలీవుడ్ లోకి పరిచయమైంది. కీర్తి, కల్యాణి.. ఇద్దరి తల్లిదండ్రులు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినవాళ్లే. అలా వీళ్లకు చిన్నప్పటినుంచే పరిచయం. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు.
‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత ఈ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాదాపు సౌత్ లో అందరు హీరోలతో నటించేసింది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. తాజాగా వచ్చిన ‘దసరా’తో పాన్ ఇండియా హిట్ కొట్టేసింది. ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం స్లోగా సినిమాలు చేస్తోంది. ‘హలో’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మలయాళంలో నటిస్తూ బిజీగా ఉంది. మరి ఈ ఇద్దరు భామలని చిన్నప్పటి ఫొటోని మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.