నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా బింబిసార. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 5న ఈ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా బింబిసార చిత్ర యూనిట్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కళ్యాణ్ రామ్‌తో పాటు ఆయన సతీమణి కూడా శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. దర్శనానంతరం ఆలయ పండితులు వారికి రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన ఆలయం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ బింబిసార సినిమా హిట్ అవ్వాలని.. సినిమా మీద, చిత్ర యూనిట్ మీద శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ఆయన కోరుకున్నట్లు వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి కళ్యాణ్ రామ్‌తో పాటు.. దర్శకుడు వశిష్ట, కమెడియన్ శ్రీనివాసరెడ్డి, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తదితరులు వెళ్ళారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.